Pawan Kalyan: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది
ABN , Publish Date - Jan 10 , 2025 | 04:11 PM
Pawan Kalyan: రాష్ట్రంలో పాడి పరిశ్రమను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అమూల్ తీసుకొచ్చి.. ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని విమర్శించారు.
కాకినాడ, జనవరి 10: రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులం షెడ్లు ఏర్పాటు చేశామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కుమారపురంలో గోకులం షెడ్లను శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అద్బుతంగా జరుపుకుందామని అనుకున్నామన్నారు.
కానీ తిరుపతిలో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మాములుగా నిర్వహిస్తున్నామని వివరించారు. కూటమి విజయం అంటే.. ప్రజలు, రాష్ట్రం ఉమ్మడి గెలుపు అని ఈ సందర్భంగా సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. మీరు ఇచ్చిన విజయంతో రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. దేశం రుణం తీర్చుకోవాలని ఈ సందర్భంగా యువతకు ఆయన పిలుపు నిచ్చారు. పల్లె రుణం తీర్చుకోవాలన్నది తన కోరిక అని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే గ్రామాల్లో విధులు నిర్వహించే క్రమంలో మరింత బాధ్యతగా ఉండాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు ఆయన సూచించారు. తాము అండగా ఉంటామని అధికారులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
6 నెలల్లో ఏం చేశారని అడిగిన వారికి చెబుతున్నానంటూ .. తాము ఈ కాలంలో 12,500 గోకులాలు నిర్మించామని తెలిపారు. గత జగన్ ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందన్నారు. భవిష్యత్తులో మరో 20 వేల గోకులాలు ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు. గత ప్రభుత్వం అమూల్‌ను తీసుకొచ్చి.. ప్రభుత్వ డెయిరీలను చంపేసిందని మండిపడ్డారు. గత జగన్ ప్రభుత్వం గోకులాలపై సైతం దృష్టి పెట్టలేదన్నారు. అయితే గోవులు, గోకులాలను సంరక్షించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపు నిచ్చారు.
Also Read: టీటీడీ చైర్మన్, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్
Also Read: బ్రాండ్ ఏపీ ముందుకెళ్తోంది
మరోవైపు.. ఈ ఆరు నెలల్లో కూమిటి ప్రభుత్వం ఏమి చేసిందంటూ వైసీపీ అగ్రనేతలు పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై విధంగా సమాధానమిచ్చారు.
For AndhraPradesh News And Telugu News