Share News

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. హైకోర్టులో పిల్

ABN , Publish Date - Jan 10 , 2025 | 08:47 PM

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై విచారణ జరపాలంటూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు అయింది. శుక్రవారం ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి ఈ వాజ్యాన్ని దాఖలు చేశారు.

Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట.. హైకోర్టులో పిల్
AP High Court

అమరావతి, జనవరి 10: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలని హైకోర్టులో ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి శుక్రవారం ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో కానీ లేదా మాజీ న్యాయమూర్తితో విచారణ జరపాలని ఆ ప్రజా ప్రయోజన వాజ్యంలో స్పష్టం చేశారు. దీనిపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఆయన తరఫు న్యాయవాది శివప్రసాదరెడ్డి.. హైకోర్టును కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. వేకేషన్ కోర్టులో వేస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ప్రభాకర్ రెడ్డి.. కోర్టులో ఈ పిల్ దాఖలు చేశారు. మరోవైపు ఇదే అంశంపై న్యాయ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించిన సంగతి తెలిసిందే.

అలాగే తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు రూ. 50 వేల చొప్పున రూ. 3 లక్షలు విరాళం టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. ప్రభుత్వానికి అందజేశారు. అలాగే పాలక మండలి సభ్యురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సైతం రూ. 10 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఇక పాలక మండలి సభ్యురాలు, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా సైతం రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు.


జనవరి 10వ తేదీ ముక్కోటి ఏకాదశి. ఆ రోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలని భక్తులు భావించారు. ఆ క్రమంలో టోకెన్లు తీసుకొనేందుకు వేలాది మంది ముందుగా తిరుపతి చేరుకున్నారు. ఈ సందర్బంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో ఆరుగురు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Also Read: ఆసుపత్రిలో పరామర్శ.. జగన్ గుట్టు విప్పిన మంత్రి ఆనం

Also Read: గత ప్రభుత్వం.. ప్రభుత్వ డెయిరీలను చంపేసింది

Also Read: టీటీడీ చైర్మన్‌, ఈవోలపై పవన్ కల్యాణ్ ఫైర్


ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు నాయుడు.. తిరుపతి చేరుకున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా టీటీడీ ఉన్నతాధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై జ్యూడిషియల్ విచారణకు ఆదేశించారు. అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులను సైతం ఆయన పరామర్శించారు. ఇక మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని సైతం ప్రకటించారు.

Also Read: మృతుల ఇంటికి పాలక మండలి సభ్యులు..

Also Read: అంతరిక్షంలో త్రీగోర్జెస్ డ్యామ్ నిర్మాణానికి చైనా అడుగులు


డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ సైతం.. తిరుమల చేరుకుని.. ఈ ఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. అనంతరం ఆయన స్పందిస్తూ.. ప్రజలకు క్షమాపణలు తెలిపారు. టీటీడీ బోర్డ్ చైర్మన్, ఈవో సైతం క్షమాపణలు చెప్పాలన్నారు. టీటీడీ చైర్మన్ సైతం ఈ ఘటనలో పాలక మండలి తప్పు లేకున్నా.. క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు.

Also Read: బ్రాండ్‌ ఏపీ ముందుకెళ్తోంది

Also Read: జగనన్న కాలనీల పేరు మార్చిన ప్రభుత్వం


అలాగే టీటీడీ సైతం మృతుల కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కులను మృతుల కుటుంబాలను కలిసి పాలక మండలి సభ్యులు స్వయంగా అందజేస్తారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 10 , 2025 | 08:48 PM