Share News

RGV: పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ

ABN , Publish Date - Feb 07 , 2025 | 07:20 AM

వివాదాస్పద సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ శుక్రవారం ఒంగోలు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో జరిగే విచారణకు హాజరుకానున్నారు. ఒంగోలు రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో విచారణ జరగనుంది. అందుకు సంబంధించి పోలీసులు పటిష్ఠంగా భద్రత ఏర్పాట్లు చేశారు.

RGV: పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
RGV Police Investigation

ప్రకాశం జిల్లా: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ (Rangopal Varma) శుక్రవారం పోలీసు విచారణకు (Police Investigation) హాజరుకానున్నారు. ఇవాళ ఒంగోలు (Ongole)లో రూరల్ పోలీస్ స్టేషన్‌లో వర్మపై నమోదైన కేసు (Case)పై విచారణ జరగనుంది. ఫిబ్రవరి 4న విచారణకి హాజరు కావాలని సీఐ శ్రీకాంత్ ఇటీవల నోటీసు (Notice) జారీ చేశారు. అయితే ఫిబ్రవరి 7న విచారణకు హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్జీవీ కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరవుతానని విచారణాధికారి సీఐ శ్రీకాం‌కు వర్మ సమాచారం ఇచ్చారు.


కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనిపై గత ఏడాది నవంబర్ 10న వర్మ పై మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నవంబర్ 19, 25 తేదీల్లో రెండు సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పోలీస్ విచారణకు హాజరుకాకుండా కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో పోలీసులు అరెస్టే చేయకుండా ఉండేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారు. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూనే.. పోలీసుల విచారణకు సహకరించాలని ఆర్జీవీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది.


రాంగోపాల్ వర్మ గతంలో పలుసార్లు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతూ వచ్చారు. పలుమార్లు పోలీసులు నోటీసులు ఇవ్వడం.. ఆయన డుమ్మా కొట్టడం జరుగుతూ వచ్చాయి.. తాజాగా ఫిబ్రవరి 4న విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులపై స్పందించిన ఆర్జీవీ.. 7న విచారణకు వస్తానని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ రోజైనా వర్మ.. పోలీసుల విచారణకు హాజరవుతారా.. లేదా.. ఇంకా ఏదైనా కారణం చూపి.. చివరి నిమిషంలో డుమ్మా కొడతారా.. అనేది ఉత్కంఠగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సమాజం కోసం మనం సైతం

విలువల గురించి జగన్‌ మాట్లాడటం...

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 07 , 2025 | 07:21 AM