Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు
ABN , Publish Date - Mar 17 , 2025 | 03:51 PM
Droupadi Murmu: ఏపీ ఎంపీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అలాగే ఈ విందుకు ఏపీతోపాటు హర్యానా, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన ఎంపీలు విచ్చేశారు.

న్యూఢిల్లీ, మార్చి 17: ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల ఎంపీలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అల్పాహార విందు ఇచ్చారు. సోమవారం అంటే.. మార్చి 17వ తేదీన న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందులో పాల్గొన్న ఎంపీలందర్నీ కలిసి.. వారి వారి పార్లమెంట్ నియోజకవర్గ విశేషాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ ఓం బిర్లాతోపాటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. అలాగే ఏపీ, కేరళ, కర్ణాటక, హర్యానాకు చెందిన ఎంపీలు ఈ అల్పాహార విందుకు విచ్చేశారు. ఈ అల్పాహార విందుకు ఆహ్వానించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఎంపీలు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్ రూపొందించాం
KTR criticizes Congress govt: కాంగ్రెస్ పాలన ఫలితమే ఇదీ.. కేటీఆర్ ఫైర్
12వ రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్
For Andhrapradesh News And Telugu News