Alluri Sitaramaraju District : ఏజెన్సీ గజగజ
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:35 AM
ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి.

అరకులోయలో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత
పాడేరు, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. శనివారం అరకులోయలో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే జి.మాడుగులలో 4.5, డుంబ్రిగుడలో 5.7, జీకే వీధిలో 5.8, పాడేరులో 5.9, హుకుంపేటలో 6, పెదబయలులో 7, చింతపల్లిలో 7.2, అనంతగిరిలో 7.9, ముంచంగిపుట్టులో 9.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకూ దట్టంగా మంచు కురుస్తోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలి మొదలవుతోంది.