Home » Alluri Seetharamaraju
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోమ, మంగళవారాల్లో అల్లూరి జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసి, ఎకో టూరిజంపై సమీక్షించనున్నారు
ఇటీవల మావోయిస్టు ప్రభావాన్ని నియంత్రించే క్రమంలో అక్కడ సీఆర్పీఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో చలి గజగజ వణికిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి.
తెగిపడిన కరెంటు తీగపై కాలు వేసిన కొడుకుని కాపాడబోయి తల్లి, ఆ తల్లిని కాపాడబోయి కూతురు... ఇలా విద్యుత్ షాక్‌తో ముగ్గురూ మృతిచెందారు.
అరకు నుంచి విశాఖపట్నం వెళ్తున్న గూడ్స్ రైలు సోమవారం తెల్లవారుజామన చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
గుమ్మ పంచాయతీ కర్రి గడ గ్రామానికి చెందిన బడ్నాయిని రాములమ్మ నిండు గర్భిణీని నెలలు నిండి నొప్పులు మొదలయ్యాయి. ఆ గ్రామంలో ఆస్పత్రి సదుపాయం లేకపోవడంతో ప్రసవం కోసం వైద్య కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆమె భర్త బడ్నాయిని సన్యాసిరావు, అతని అన్నయ్య బడ్నాయిని బొజ్జన్న ఇద్దరు ఎత్తైన కొండ శిఖర గ్రామం నుంచి గుమ్మ పంచాయతీ కేంద్రం వరకు ఆమెను డోలీలో మోసుకొని వచ్చారు.
బ్రిటీష్ పాలకుల అకృత్యాల నుంచి ఆదివాసీలను విముక్తులను చేయడానికి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నడిపించిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర సంగ్రామంలో చరిత్ర సృష్టించింది. సాయుధ పోరాటానికి అవసరమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి తొలిసారి 1922 ఆగస్టు 22వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్‌పై తన సైన్యంతో అల్లూరి దాడి చేశాడు.
లైన్మెన్ కూర రామయ్య(Lineman Kura Ramaiah) చేసిన సాహనం ఏపీ విద్యుత్ ఉద్యోగులందరికీ ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravi Kumar) అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద ప్రవాహాన్ని సైతం లెక్కచేయకుండా విద్యుత్ తీగలపై నడిచివెళ్లి కరెంట్ పునరుద్ధరించడాన్ని మంత్రి కొనియాడారు.
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పార్కు...
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ‘