Share News

SANKRANTI SPECIAL TRAINS: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

ABN , Publish Date - Jan 12 , 2025 | 05:20 PM

SANKRANTI SPECIAL TRAINS: సంక్రాంతి పండగ వేళ.. ప్రయాణికులకు మళ్లీ దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని ప్రత్యేక రైళ్లు నడుపుతోన్నట్లు ప్రకటించింది.

SANKRANTI SPECIAL TRAINS: ప్రయాణికులకు మళ్లీ గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే

హైదరాబాద్‌, జనవరి 12: సంక్రాంతి వేళ.. ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మళ్లీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పండగ వేళ.. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయితే విశాఖపట్నం-హైదరాబాద్‌ మధ్య రాకపోకలు సాగిస్తున్న వందేభారత్‌ (20707/20708) ఎక్స్‌ప్రెస్‌లో కోచ్‌ల సంఖ్యను 8 నుంచి 16కు పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దీంతో ప్రయాణికుల సీట్ల సంఖ్య 530 నుంచి 1,128కి పెరగనుందని ప్రకటించింది. ఈ నిర్ణయం జనవరి 13వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది.

Vandebharath.jpg

పండగ రోజుల్లో రద్దీ దృష్ట్యా..

మరోవైపు పండగ రోజుల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 36 ప్రత్యేక రైళ్లను నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించిన సంగతి తెలిసిందే. వాటిలో సికింద్రాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లు, అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య సైతం మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.


ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లు…

ప్రత్యేక రైలు నెం.07021 ఈనెల 11వ తేదీ రాత్రి 09 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. అలాగే కాకినాడ నుంచి 07022 నెంబర్ గల ప్రత్యేక రైలు జనవరి 12వ తేదీ సాయంత్రం 05.40 గంటలకు కాకినాడ పట్టణంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 05.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక ప్రత్యేక రైలు నెంబరు 07023 జనవరి 12వ తేదీ సాయంత్రం 06.30 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07.10 గంటలకు కాకినాడ నగరానికి చేరుకోంటుంది. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు నెం. 07024 జనవరి 13వ తేదీ రాత్రి 10.00 గంటలకు కాకినాడ పట్టణం నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

Also Read: వేరే వారికి పుట్టిన బిడ్డ.. తన బిడ్డగా చెప్పుకొంటుంది


ప్రత్యేక రైళ్లు నడిచే స్టేషన్లు..

సికింద్రాబాద్ నుంచి కాకినాడ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్‌లో ఆగనున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి కాకినాడ టౌన్ మధ్య నడిచే రెండు ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగు రాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట రైల్వే స్టేషన్‌లలో ఆగనున్నాయి.

Also Read: నారా వారి పల్లెకు సీఎం చంద్రబాబు.. అయితే


జనవరి 7, 14వ తేదీల్లో సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ (రైలు నెంబర్ 07089). జనవరి 8, 15వ తేదీల్లో బ్రహ్మపూర్ నుంచి వికారాబాద్ ( రైలు నెం. 07090). జనవరి 9, 16వ తేదీల్లో వికారాబాద్ నుంచి బ్రహ్మాపూర్ (రైలు నెం. 07091). జనవరి 10, 17 బ్రహ్మపూర్ నుంచి సికింద్రాబాద్ (రైలు నెం. 07092). జనవరి 10, 17, 24వ తేదీల్లో విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ (రైలు నెం. 08541). జనవరి 11, 18, 25 తేదీల్లో కర్నూలు సిటీ నుంచి విశాఖపట్నం ( రైలు నెంబర్ 08542). జనవరి12,19, 26వ తేదీల్లో శ్రీకాకుళం నుంచి వికారాబాద్ (రైలు నెంబరు 08547). జనవరి 13, 20, 27వ తేదీల్లో.. వికారాబాద్ నుంచి శ్రీకాకుళం (రైలు నెంబర్ 08548). జనవరి 10, 17 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి తిరుపతి (రైలు నెంబర్ 02764). జనవరి 11, 18వ తేదీల్లో తిరుపతి నుంచి సికింద్రాబాద్ (రైలు నెంబరు 02763). జనవరి 12వ తేదీ సికింద్రాబాద్ నుంచి కాకినాడ (రైలు నెంబర్ 07271). జనవరి 13వ తేదీ.. కాకినాడ నుంచి సికింద్రాబాద్ (రైలు నెంబర్ 07272).


జన సాధారణ్​ రైళ్లు..

అలాగే విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు. ఈ అన్​రిజర్వ్​డ్​ స్పెషల్​ రైళ్లు చర్లపల్లి-విశాఖపట్నం స్టేషన్ల మధ్య జనవరి 10 నుంచి 17 తేదీల మధ్య మొత్తం 16 జన సాధారణ్ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఇక సికింద్రాబాద్​నుంచి అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు - కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులను సైతం ఏర్పాటు చేశారు. ఈ జనసాధారణ్ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌ల్లో ప్రయాణించే ప్రయాణికులకు సులభతరం చేయడానికి అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్​ల వివరాలు ఇలా ఉన్నాయి.

trains.jpg

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 12 , 2025 | 06:07 PM