Share News

Special Train: అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు..

ABN , Publish Date - Mar 26 , 2025 | 01:26 PM

అనంతపురం, గుంతకల్లు మీదుగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 28వ తేదీన బెంగళూరు-కలబురగి మధ్య (వయా గుంతకల్లు) అప్‌ అండ్‌ డౌన్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగంచుకోవాలని అధికారులు కోరారు.

Special Train: అనంతపురం, గుంతకల్లు మీదుగా  ప్రత్యేక రైలు..

గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు-కలబురగి మధ్య (వయా గుంతకల్లు) అప్‌ అండ్‌ డౌన్‌ ట్రిప్‌ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు-కలబురగి ప్రత్యేక రైలు (నం. 06519) ఈనెల 28వ తేదీ రాత్రి 9.15 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.40 గంటలకు కలబురగికి చేరుకుంటుందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: CM Stalin: కేంద్రం బెదిరించినా ద్విభాషే మా విధానం


pandu1.2.jpg

తిరుగు ప్రయాణపు రైలు (నం.06520) ఈనెల 29వ తేదీ ఉదయం 9.35 గంటలకు కలబురగిలో బయలుదేరి అదేరోజు రాత్రి 8 గంటలకు బెంగళూరు చేరుకుంటుందని తెలియజేశారు. ఈ రైలు యల్హంక, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు(Dharmavaram, Anantapur, Guntakal), మంత్రాలయం రోడ్డు, రాయచూరు, యాద్గిర్‌, షంషాబాద్‌ స్టేషన్ల మీదుగా గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

మీ మనసు బాధపడితే ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటా..

మిస్‌ వరల్డ్‌ పోటీలకు 54 కోట్ల ఖర్చు తప్పుకానప్పుడు ఫార్ములా-ఈ తప్పుకాదు

త్వరలో ఎకో టూరిజం పాలసీ

డ్రగ్స్‌ నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 26 , 2025 | 01:26 PM