CM Chandrababu: ఎర్రన్నాయుడు తిరుగులేని నాయకుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Feb 23 , 2025 | 08:52 AM
దివంగత తెలుగుదేశం పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడని కొనియాడారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత (TDP Leader).. దివంగత కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు (Kinjarapu Errannaidu) జయంతి (Jayanthi) సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఘనంగా నివాళులర్పించారు (Tribute). ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడని కొనియాడారు. మూడు దశాబ్దాలకు మించిన రాజకీయ జీవితంలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న తన ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందామని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
ఎర్రన్న ఘాట్‌ను సందర్శించిన మంత్రులు
కాగా శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం, నిమ్మాడలోని దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఘాట్‌ను ఎర్నన్న తనయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు (ఎర్రన్నాయుడు సోదరుడు) ఆదివారం (ఈనెల 16న) సందర్శించారు. ఆదివారం (23న) ఎర్రన్నాయుడు జయంతి వేడుకల నిర్వహణపై ఆయన సోదరులు కింజరాపు ప్రభాకర్, హరివరప్రసాద్‌లతో చర్చించారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.