Srikakulam: శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో రధసప్తమి వేడుకలు
ABN , Publish Date - Feb 02 , 2025 | 07:26 AM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం రథసప్తమి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి మూడురోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

శ్రీకాకుళం: ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామి ( Sri Suryanarayana Swamy) జయంతిని (Jayanthi) పురస్కరించుకుని రథసప్తమి వేడుకలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం (Kutami Govt.) రథసప్తమిని (Rathasaptami ) రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం నుంచి మూడురోజుల పాటు వైభవంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం తెల్లవారుజామునుంచే క్యూ లైన్లలో నిలుచున్నారు. రధసప్తమి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు శ్రీకాకుళంలో హెలికాఫ్టర్ టూరిజం ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. రధసప్తమి ఉత్సవాలకు శ్రీకాకుళం సర్వాగసుందరంగా ముస్తాబైంది.
మూడు రోజులు వేడుకలు..
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి.. రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. కూటమి ప్రభుత్వం తొలిసారిగా ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా హెలీకాఫ్టర్ టూరిజం, లేజర్ షో నిర్వహించనున్నారు. బుల్లితెర ప్రముఖులతో ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, నృత్యరూప ప్రదర్శనలకు సన్నాహాలు చేస్తున్నారు. ఉత్సవాలకు లక్షలాది మంది తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం 80 అడుగుల రోడ్డులో 6 గంటలకు సామూహిక సూర్యనమస్కారాలతో వేడుకలకు శ్రీకారం చుట్టారు.
ఈ వార్త కూడా చదవండి..
కార్యక్రమాల వివరాలు..
ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ మునిసిపల్ స్కూల్ మైదానంలో గ్రామీణ క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, కర్రసాము, సంగిడీలు, ఉలవల బస్తా లిఫ్టింగ్, పిల్లి మొగ్గలు వంటి పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు డేఅండ్‌నైట్ జంక్షన్ నుంచి నమూనా రథాలతో ర్యాలీ ప్రారంభించి.. అరసవల్లి ఆలయం వరకూ శోభాయాత్ర నిర్వహిస్తారు. జానపద కళారూపాలు, కోలాటం, తప్పెటగుళ్లు, థింసా నృత్యం వంటి ప్రదర్శనలదో శోభాయాత్ర సాగనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 వరకు ప్రభుత్వ డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఆరోహి స్కూల్ ఆఫ్ మ్యూజిక్, దుంపల ఈశ్వర్, యామినీకృష్ణ, పరిమళ, అనురాధ, లక్ష్మి గణపతి శర్మ బృందాల ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. బుల్లితెర నటులు హైపర్ ఆది, పైమా, ఢీ భూమిక, రేలారే రేలా టీమ్, మిమిక్రీ ఆనంద్, జోష్ శివ, పిన్ని సాంగ్ ఫేమ్ షన్ముఖ, సురేష్ రేష్మా, బాలాజీ వంటి ప్రముఖుల ధూంధాం కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు లేజర్ షో ప్రదర్శిస్తారు. రాత్రి 9 గంటలకు శ్రీ అంజనా కళా సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ నటీనటులతో పంచరత్నాలు పౌరాణిక నాటక ప్రదర్శన ఉంటుంది. మయసభ పడక సీను, శ్రీరామాంజనేయ యుద్ధం, భక్త చింతామణి, గయోపాఖ్యానం, శ్రీ సత్య హరిశ్చంద్ర వారణాశి నుంచి ప్రారంభం వంటి నాటకాలు ప్రదర్శిస్తారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎడ్ల గోపాలరావు ఆధ్వర్యంలో పౌరాణిక నాటిక నిర్వహిస్తారు. నీరజా సుబ్రహ్మణ్యం, రఘుపాత్రుని శ్రీకాంత్ ఆధ్వర్యంలో నృత్యరూపక ప్రదర్శనలు జరగనున్నాయి. అలాగే కల్లేపల్లి గురుకులం సంప్రదాయం డైరెక్టర్ స్వాతి సోమనాథన్ ఆధ్వర్యంలో యోగాపై నృత్య రూపకం ప్రదర్శిస్తారు. మంగళవారం రాత్రి ప్రముఖ గాయని మంగ్లీ ఆధ్వర్యంలో సినీ మ్యూజిక్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
హెలికాప్టర్ టూరిజం
తొలిసారిగా హెలికాప్టర్ టూరిజం అందుబాటులోకి తెచ్చారు. కలెక్ట రేట్ సమీపాన డచ్ బిల్డింగ్ వద్ద నేటి నుంచి మూడు రోజులపాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు హెలికాప్టర్ రైడ్ ఉంటుంది. ఆర్ట్స్ కళాశాల మైదానంలోనే ఫుడ్ కోర్టులు అందుబాటులో ఉంచారు. కోడిరామ్మూర్తి స్టేడియంలో పార్కింగ్, మరుగుదొడ్లు సౌకర్యం కల్పించారు. ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ ... రధసప్తమి వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, డీఎస్పీ వివేకానందతో చర్చించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. 80 అడుగుల రోడ్డులో సూర్యనమస్కారాల ఏర్పాట్లు, మిల్లు జంక్షన్ వద్ద సుందరీకరణ పనులు, ఆర్ట్స్ కళాశాలలో స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్టీఆర్ ఎంహెచ్ స్కూల్ మైదానంలో జరగబోయే క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించారు.
కట్టుదిట్టమైన బందోబస్తు..
రథసప్తమి వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుం డా భక్తులు ప్రశాంతంగా సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించాలని జిల్లా పోలీసు యంత్రాంగానికి ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి ఆ దేశించారు. బందోబస్తు ఏర్పాట్లలో భాగంగా అరసవిల్లి ఆలయం, క్యూ లైన్లు, టిక్కెట్లు, ప్రసాదం విక్రయ కేంద్రాలు, పార్కింగ్ ప్రాంతాలు, హెలీపాడ్, సూర్య నమస్కారాల సభ, ఆర్ట్స్ కళాశాల మైదానంలో కార్యక్రమాలకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను శనివారం ఎస్పీ మహేశ్వరరెడ్డి పరిశీలించారు. 2, 3, 4 తేదీల్లో నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. 2,300 మంది పోలీసు సిబ్బందికి విధులు కేటాయించడంతో పాటు, అరసవల్లి తోటలో వారికి ఎస్పీ పలు సూచనలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News