Tirumala: తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ.. ఒకరికి గాయాలు
ABN , Publish Date - Mar 20 , 2025 | 04:44 PM
Tirumala: తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య స్వల్ప వివాదం చోటు చేసుకుంది. అదికాస్తా చినికి చినికి గాలి వానగా మారింది. దీంతో భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దాంతో ఓ భక్తుడి ఆగ్రహం కట్టలు తెంచుకొంది.

తిరుమల, మార్చి 20: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా ఘర్షణగా మారింది.చివరకు ఓ భక్తుడు ఆసుపత్రి పాలయ్యాడు.ఇంతకీ ఏం జరిగిందంటే..గురువారం తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద భక్తులు క్యూ లైన్‌లో నిల్చనున్నారు. ఆ క్రమంలో తన కుమారుడిని తోసిన వ్యక్తిపై అతడి తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అదే సమయంలో క్యూ లైన్‌లోని వ్యక్తులంతా కలిసి... యువకుడి తండ్రిని కొట్టారు.
దీంతో ఆగ్రహించిన ఆ తండ్రి.. తన చేతిలోని గాజు బాటిల్‌తో ఎదుటి వ్యక్తిపై దాడి చేశాడు. తలకు తీవ్ర గాయం కావడంతో.. తోటి భక్తుడు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ క్రమంలో జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనంతరం గాజు సీసాతో దాడి చేసిన వ్యక్తిని వారు అదుపులోకి తీసుకున్నారు. అయితే దాడి కారణంగా ఆసుపత్రిలో చేరిన వ్యక్తికి ప్రాణాపాయం లేదని.. అయితే బలమైన గాయం అయితే అతడికి తగిలిందని వైద్యులు వెల్లడించారు.
Also Read:
Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం
CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..
For AndhraPradesh News And Telugu News