Share News

Today Breaking News:భూమిలేకపోయినా.. రైతు భరోసా.. రేవంత్ సంచలన ప్రకటన

ABN , First Publish Date - Jan 04 , 2025 | 07:01 PM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Today Breaking News:భూమిలేకపోయినా.. రైతు భరోసా.. రేవంత్ సంచలన ప్రకటన
Breaking News

Live News & Update

  • 2025-01-04T21:12:34+05:30

    వ్యవసాయ కూలీలకు రైతు భరోసా.. రేవంత్ ప్రకటన

    • తెలంగాణలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం

    • జనవరి 26న కొత్త పథకాలకు శ్రీకారం

    • కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రిమండలి ఆమోదం

    • వ్యవసాయం చేసే భూములకు రైతు భరోసా సాయం

    • ఎకరాకు రూ.12వేల సాయం

    • వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం

    • రాళ్లు, రప్పులు, రోడ్లకు రైతు భరోసా ఇవ్వబోమన్న సీఎం రేవంత్

    • అర్హులందరికీ పెట్టుబడి సాయం అందిస్తామన్న రేవంత్

  • 2025-01-04T20:48:50+05:30

    రైతు భరోసాపై మంత్రిమండలి కీలక నిర్ణయం

    • రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

    • రైతు భరోసా విధివిధానాలపై చర్చించిన మంత్రిమండలి

    • కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

    • రైతు భరోసా డబ్బులు ఎప్పటినుంచి జమచేస్తారనేదానిపై స్పష్టత ఇచ్చే అవకాశం

    • ఎవరెవరికి రైతు భరోసా ఇస్తారనేదానిపై ప్రకటన చేయనున్న సీఎం

  • 2025-01-04T20:30:07+05:30

    గేమ్ ఛేంజర్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్

    • పవన్ కల్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా..

      ఏ హీరో ఉన్నా.. దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి

    • నన్ను మీరు ఓజి అనండి.. డిప్యూటీ సీఎం అనండి

      అన్నింటికి ఆయనే ఆద్యుడు

    • నేను ఎప్పటికీ మూలాలు మర్చిపొను

  • 2025-01-04T19:45:22+05:30

    రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    • ఈవెంట్ ప్రాంగణానికి చేరుకున్న రామ్‌చరణ్

    • గేమ్‌ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రాంగణానికి చేరుకున్న పవన్ కళ్యాణ్

  • 2025-01-04T19:25:23+05:30

    రాజమండ్రిలో గేమ్‌ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

    • డిసెంబర్ 10న విడుదల కానున్న గేమ్ ఛేంజర్ మూవీ

    • ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న గేమ్ ఛేంజర్

    • రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్

    • రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్

    • ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన చిరంజీవి, పవన్ కళ్యాణ్

    • ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న సినీ ప్రముఖులు

  • 2025-01-04T19:01:05+05:30

    లాలాగూడా లో విషాదం

    • తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు ఆత్మహత్య

    • రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఇంట్లోనే మృతి చెందిన తల్లి

    • తల్లి మృతి ని చూసి తట్టుకోలేక కుమారుడు ఆత్మహత్య

    • రెండు రోజులుగా గదిలోనే తల్లి, కుమారుడి మృతదేహాలు

    • దుర్వాసన రావడం తో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు

    • కేసు దర్యాప్తు చేస్తున్న లాలాగూడ పోలీసులు