Tirumala : కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:20 AM
కుంభమేళాలో తిరుమల తరహాలోనే శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించి కైంకర్యాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం మీడియాకు తెలిపారు
ప్రయాగరాజ్‌లో 2.89 ఎకరాలు కేటాయించిన
యూపీ సర్కారుతిరుమల తరహాలో రోజూ పూజలు: టీటీడీ ఈవో
తిరుమల, జనవరి 7(ఆంధ్రజ్యోతి): కుంభమేళాలో తిరుమల తరహాలోనే శ్రీవారి నమూనా ఆలయాన్ని నిర్మించి కైంకర్యాలు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు మంగళవారం మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ప్రయాగరాజ్‌లోని సెక్టార్ 6, భజరంగ్‌దాస్ రోడ్డులోని నాగవాసుకి ఆలయానికి సమీపంలో 2.89 ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటు చేస్తున్నామని, సుప్రభాతం నుంచి ఏకాంతసేవ వరకు అన్ని సేవలనూ నిర్వహిస్తామన్నారు.