Share News

Vidadala Rajini: విడదల రజినికి తాత్కాలిక ఊరట

ABN , Publish Date - Feb 18 , 2025 | 05:10 PM

Vidadala Rajini: ఐటీడీపీకి సంబంధించి.. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Vidadala Rajini: విడదల రజినికి తాత్కాలిక ఊరట
Vidadala Rajini

అమరావతి, ఫిబ్రవరి 18: మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో విడదల రజినితోపాటు ఆమె పీఏలపై కఠిన చర్యలు తీసుకోవద్దంటూ చిలకలూరిపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 20వ తేదీకి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఐటీడీపీకి సంబంధించి.. సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే విడదల రజిని, ఆమె పీఏలతోపాటు పోలీసులు తనను వేధించారంటూ చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాననే కారణంతో 2019లో అప్పటి పట్టణ సీఐ సూర్య నారాయణ తనను అరెస్ట్ చేశారని.. తనను కోర్టులో ప్రవేశపెట్టకుండా.. తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


ఇదంతా నాటి ఎమ్మెల్యే రజిని ఆదేశాల మేరకే జరిగిందని పేర్కొన్నారు. కులం పేరుతో సైతం తనను దూషించారని ఆరోపించారు. దీనిపై పోలీసులకు పదే పదే ఫిర్యాదులు చేసినప్పటికి.. వారు ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తన పిటిషన్‌లో పిల్లి కోటి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: వాయిదా పడనున్న కేబినెట్ భేటీ !


ఈ నేపథ్యంలో కోటి పిటిషన్‌పై హైకోర్టు ఇటీవల విచారణ జరిపింది. ఆ క్రమంలో విడదల రజిని, ఆమె పీఏ రామకృష్ణ, ఫణితో పాటు నాటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణలపై కేసు నమోదు చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా.. రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి దర్యాప్తు వివరాలను తమకు సమర్పించాలని పల్నాడు జిల్లా పోలీసులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అందులోభాగంగా విడదల రజిని, ఆమె పీఏలు రామకృష్ణ, ఫణికుమార్‌‌తోపాటు సీఐ సూర్యనారాయణలపై చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్‌‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేశారు.

Also Read: జగన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు


అయితే ఈ కేసులో తమకు ముందస్తు బెయిలు కోరుతూ.. విడదల రజినితోపాటు మిగిలిన ముగ్గురు పిబ్రవరి 10వ తేదీన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషనర్‌పై నాలుగు కేసులు ఉన్నట్లు తన పిటిషన్‌లో రజిని కోర్టుకు తెలియజేశారు.

Also Read: జగన్ రెడ్డికి పలు ప్రశ్నలు సంధించిన ఏపీ టీడీపీ చీఫ్


అంతేకాకుండా.. ఈ కేసుల్లో తమపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునే ఉద్దేశంతోనే అతడు ఈ విధంగా తప్పుడు ఫిర్యాదు చేశారని రజని తన పిటిషన్‌లో స్పష్టం చేశారు. కేసు నమోదైన నేపథ్యంలో పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని.. ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలని రజని తన పిటిషన్‌లో హైకోర్టును అభ్యర్థించారు.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 18 , 2025 | 05:10 PM