Share News

Anakapalli: జిల్లాలో వెలుగు చూసిన అరుదైన జంతు జాతి.. ఆందోళనలో ప్రజలు..

ABN , Publish Date - Jan 13 , 2025 | 02:53 PM

ఆంధ్రప్రదేశ్: రావికమతం మండలం చీమలపాడు (Chimalapadu) పంచాయతీ పరిధిలో అరుదైన జంతు జాతి బయటపడింది. వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని భావించిన అరుదైన అడవి దున్నలు (Wild Buffaloes) స్థానికుల కంట పడ్డాయి. కళ్యాణపులోవ రిజర్వాయర్ (Kalyanapulova Reservoir) నుంచి బంగరు బందరు గ్రామం వెళ్లే మార్గమధ్యలో అడవి దున్నలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.

Anakapalli: జిల్లాలో వెలుగు చూసిన అరుదైన జంతు జాతి.. ఆందోళనలో ప్రజలు..

అనకాపల్లి: రావికమతం మండలం చీమలపాడు (Chimalapadu) పంచాయతీ పరిధిలో అరుదైన జంతు జాతి బయటపడింది. వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని భావించిన అరుదైన అడవి దున్నలు (Wild Buffaloes) స్థానికుల కంట పడ్డాయి. కళ్యాణపులోవ రిజర్వాయర్ (Kalyanapulova Reservoir) నుంచి బంగరు బందరు గ్రామం వెళ్లే మార్గమధ్యలో అడవి దున్నల గుంపు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు. ఆదివారం రాత్రి 10:30 గంటల సమయంలో అటుగా వెళ్తున్న ఓ డ్రైవర్‌కు దున్నలు కనిపించాయి. వాటిని చూసిన ఆ డ్రైవర్ మెుదట అవి సాధారణ పెంపుడు జంతువులుగా భావించాడు. మరికొంత దగ్గరగా వెళ్లడంతో ఒక్కో దున్న భారీగా ఉండడంతోపాటు భయంకరంగా కనిపించాయి.

BR Naidu: వాస్తవాలు తెలుసుకుని రాయండి


భయపడిపోయిన సదరు డ్రైవర్.. దూరంగా పరిగెత్తి తన సెల్ ఫోన్ కెమెరాలో అడవి దున్నలను చిత్రీకరించాడు. అనంతరం విషయాన్ని చీమలపాడు వాసులు, అటవీశాఖ అధికారులకు తెలియజేశాడు. అయితే గ్రామంలో అడవిదున్నలు సంచరిస్తున్నాయని తెలుసుకున్న గిరిజనులు తీవ్ర భయాందోళనకు గరవుతున్నారు. ఇళ్లపైకి వస్తాయేమోనని, పొలం పనులకు వెళ్తే దాడి చేస్తాయనో ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు వాటిని గుర్తించే పనిలో పడ్డారు. స్థానికులకు ఎటువంటి ప్రమాదం లేకుండా వాటిని దారి మళ్లించే ప్రయత్నాలు మెుదలుపెట్టినట్లు తెలుస్తోంది. కాగా, అడవి దున్నలకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Chandrababu: ఆ కలెక్టర్‌పై సీఎం చంద్రబాబు ఫైర్

Amaravati : ప్రతి ఇంటా భోగ భాగ్యాలు వెల్లివిరియాలి.. తెలుగు రాష్ట్రాల సీఎంల ట్వీట్

Updated Date - Jan 13 , 2025 | 02:53 PM