TTD: మృతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ...
ABN , Publish Date - Jan 12 , 2025 | 12:10 PM
విశాఖ: తిరుపతి తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఆదివారం టీటీడీ బోర్డు సభ్యులు, హోంమంత్రి వంగలపూడి అనిత, టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్, పల్లా శ్రీనివాస్. ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ చిరంజీవి రావు తదితరులు పరామర్శించారు. ఈ సందర్బంగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన చెక్కులను పంపిణి చేశారు.
విశాఖ: తిరుపతి (Tirupati) తొక్కిసలాట (Stampede)లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డు సభ్యులు (Board members), రాష్ఠ్ర హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha), తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు (TDP Chief) పల్లా శ్రీనివాస్ (Palla Srinivas). ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు (MLA Vishnu Kumar Raju), ఎమ్మెల్సీ చిరంజీవి రావు (MLC Chiranjeevi Rao) తదితరులు ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరఫున రూ. 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తి టీటీడీలో, కాంట్రాక్ట్ ఉద్యోగం.. చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం. అందిస్తామని చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి..
కరీంనగర్ జిల్లా: నీట మునిగిన ఎస్సీ కాలనీ..
తిరుపతిలో తొక్కిసలాటపై వైసీపీ రాజకీయం..
కాగా తిరుపతి తొక్కిసలాట ఘటనలో పెనువిషాదంలో ఉన్న బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత జగన్.. తన పర్యటనను పరామర్శ పేరుతో పరిహాసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతిలో ఉండగానే గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో జగన్ తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్నారు. కలెక్టరేట్ ముందు హైవేలో ట్రాఫిక్ జామ్ కావడంతో కాసేపు కారు దిగి రోడ్డుపై నడిచి నాటకీయతకు తెరలేపారు. దీంతో వాహనాలు క్లియర్ చేయడానికి పోలీసులు తిప్పలు పడాల్సివచ్చింది. తర్వాత ఆయన కారెక్కి స్విమ్స్‌కు బయలుదేరుతుండగా తమ నాయకుడిని ఆస్పత్రికి రానివ్వకుండా కావాలనే అడ్డుకుంటున్నారంటూ వైసీపీ శ్రేణులు స్విమ్స్ సర్కిల్లో నానాయాగీ చేశారు. పోలీసులు వారిని పంపేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జగన్ స్విమ్స్‌కు చేరుకున్నారు. అప్పటికే తరలించిన యువతతో ‘సీఎం..సీఎం...’ అంటూ వైసీపీ శ్రేణులు పెద్దఎత్తున నినాదాలు చేయించారు. జగన్‌తో పాటు వారంతా ఆస్పత్రి లోపలికి చొచ్చుకుపోయారు. సంబరాలకు వచ్చినట్టు ఊగిపోయారు.
ఐసీయూలో కూడా జై జగన్ అంటూ నినాదాలు చేశారు. వారు సెల్ఫీలు తీసుకుంటున్నా పట్టించుకోకుండా జగన్ పరామర్శ కొనసాగించారు. ఆయన వెంట వైసీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, ఆర్‌కే రోజా, పిల్లి సుభాష్ చంద్రబోస్, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తదితరులున్నారు. ఇదిలావుంటే జగన్ ఆస్పత్రి లోపల ఉండగా పవన్ బయట మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న సమయంలో జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా గట్టిగా అరవడంతో జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక్కడ మనుషులు చచ్చిపోతుంటే ఏమిటీ అరుపులు. దయచేసి మౌనంగా ఉండండి’ అని పవన్ చెప్పడంతో అందరూ సైలెంటయ్యారు. కాగా, జగన్ మీడియాతో మాట్లాడుతుండగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తున్నప్పటికీ వారిని ఆయన ఏమాత్రం వారించలేదు. తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.
అలాగే తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు రూ. 50 వేల చొప్పున రూ. 3 లక్షలు విరాళం టీటీడీ పాలక మండలి సభ్యుడు, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు.. ప్రభుత్వానికి అందజేశారు. అలాగే పాలక మండలి సభ్యురాలు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి సైతం రూ. 10 లక్షల విరాళాన్ని ఇచ్చారు. ఇక పాలక మండలి సభ్యురాలు, భారత్ బయోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా సైతం రూ. 10 లక్షల విరాళాన్ని అందజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రోజా నోరు అదుపులో పెట్టుకోవాలి: జేసీ ప్రభాకర్‌రెడ్డి
శ్రీరామవతార అలంకారంలో నరసింహుడి దర్శనం
కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద బారులు తీరుతున్న వాహనాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News