Good News For AP People: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
ABN , Publish Date - Mar 19 , 2025 | 06:15 PM
Good News For AP People: కూటమి ప్రభుత్వం కోలువు తీరిన తర్వాత.. ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెబుతూ వస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది.

అమరావతి, మార్చి 19: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల సీఎంపీ కోసం కేంద్రం బుధవారం నిధులు మంజూరు చేసింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటి పోయింది. ఈ నేపథ్యంలో తిరిగి మరోసారి ఈ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం కోరింది. కేంద్రం సూచనలతో సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను టెండర్ల ద్వారా ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎంపిక చేసింది. ఈ రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూప కల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థను ఎంపిక చేసింది. విశాఖపట్నంలో రూ. 84.47 లక్షలు, విజయవాడలో రూ. 81.68 లక్షలతో ప్లాన్‌ను సంస్థ రూపొందించనుంది. ఆయా పనుల కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు సెంట్రల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం నిధులు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి..
KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..
Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..
Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది
For AndhraPradesh New And Telugu News
For AndhraPradesh News And Telugu News