Lulu Group: లూలూ గ్రూప్‌నకు తిరిగి భూ కేటాయింపు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Mar 26 , 2025 | 09:13 PM
Lulu Group: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లూలూ గ్రూప్‌నకు కేటాయించిన భూములను రద్దు చేసింది. వాటిని ఆ గ్రూప్‌నకు తిరిగి కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా జీవో జారీ చేసింది. విశాఖపట్నం హార్బర్ పార్క్ సమీపంలో గతంలో కేటాయించిన భూములనే తిరిగి కేటాయించింది. 2014లో ఏపీలో కొలువు తీరిన టీడీపీ ప్రభుత్వం విశాఖపట్నంలో లూలూ గ్రూప్‌నకు భూములు కేటాయించింది. అయితే ఆ కేటాయింపులను ఆ తర్వాత కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విధితమే.

అమరావతి, మార్చి 23:చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం హార్బర్ పార్క్ సమీపంలో లూలూ గ్రూప్‌నకు గతంలో కేటాయించిన 13.83 ఏకరాలను తిరిగి ఆ గ్రూప్‌నకు కేటాయించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. విశాఖపట్నంలో లూలూ గ్రూప్ నిర్మించనున్న షాపింగ్ మాల్, హైపర్ మార్కెట్ల నిర్మాణానికి భూమి కేటాయించాలని ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది. అలాగే ఏపీఐఐసీ ద్వారా లూలూ గ్రూప్‌నకు విశాఖలో భూకేటాయింపులు చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అదే విధంగా విశాఖ బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో ఉన్న 13.43 ఎకరాలను ఏపీఐఐసీకి బదలాయించాలని వీఎంఆర్డీఏను ప్రభుత్వం ఆదేశించింది.
విశాఖపట్నం నగరంలో లూలూ గ్రూప్ సంస్థ అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం, పెట్టుబడులకు ఎస్ఐపీబీలో ఆమోదించినట్టు పరిశ్రమల శాఖ ఇప్పటికే వెల్లడించింది. 2017లో విశాఖ బీచ్ రోడ్‌లోని హార్బర్ పార్కులో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లూలూ గ్రూప్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే 2023లో లూలూ గ్రూప్‌నకు గత ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన విషయం విదితమే. ప్రస్తుతం మళ్లీ షాపింగ్ మాల్‌తోపాటు హైపర్ మార్కెట్‌ల నిర్మాణం చేసేందుకు లూలూ గ్రూప్ ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించి భూ కేటాయింపులు చేయాల్సిందిగా ఏపీఐఐసీని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆదేశించారు.
2014లో ఏపీలో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో విశాఖపట్నంలో లూలూ గ్రూప్ పెట్టుబడులు పెట్టేందుకు.. నాటి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయింది. ఆ క్రమంలో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న పలు ఒప్పందాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. అందులో లూలూ గ్రూప్ సైతం ఉంది.
దీంతో లూలూ గ్రూప్.. తమిళనాడు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టింది. ఇక 2024లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో ఈ ఏడాది జనవరిలో సీఎం చంద్రబాబుతో లూలూ గ్రూప్ సంస్థల అధినేత అమరావతిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు లూలూ కంపెనీ తన ఆసక్తిని కనబరిచింది. అందుకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీంతో గతంలో కేటాయించిన భూమిని తిరిగి ఆ గ్రూప్‌నకు కేటాయిస్తూ.. కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Curd Rice:పెరుగన్నం తింటే లాభమా నష్టమా.. ఎందుకు తినాలి
Milk: పాలు తాగిన వెంటనే ఇవి తీసుకోంటే.. డేంజర్
Liquor Mixing : మందులోకి కూల్‌డ్రింక్ బెటరా.. వాటర్ బెటరా..
Cricket Match : క్రికెట్ చూస్తూ రెచ్చిపోతున్నారా ఈ వార్త మీ కోసమే