YCP: భయం గుప్పెట్లో.. విశాఖ వైసీపీ
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:23 PM
YCP in VSP: విశాఖపట్నంలోని వైసీపీలో ఓ విధమైన భయాందోళన నెలకొంది. జీవీఎంసీ కార్పొరేటర్లను బెంగళూరుకు విడతల వారిగా తరలిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో బెంగళూరుకు తరలించిన ఆ పార్టీ... మరో విడతలో పలువురు వైసీపీ కార్పొరేటర్లను తరలించేందుకు సన్నాహాకాలు చేస్తోంది.

విశాఖపట్నం, మార్చి 24: విశాఖపట్నం నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఆ క్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లను బెంగళూరు తరలించింది. సోమవారం మధ్యాహ్నం ఒక బృందం బెంగళూరు తరలించగా.. మరో బృందం కాసేపటి క్రితం బెంగళూరుకు బయలుదేరి వెళ్లింది. దీంతో ఇప్పటి వరకు 23 మంది కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరు తరలించినట్లు అయింది. ఇక ఈ రోజు రాత్రికి మరికొంత మందిని బెంగళూరుకు తరలించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది.
విశాఖపట్నం మహా నగర పాలక సంస్థకు నాలుగేళ్ల కిందట ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క అభ్యర్థులు విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగు చోట్ల గెలుపొందారు. అయితే ఆ సమయంలో వైసీపీ అధికారంలో ఉంది. దీంతో మెజార్టీ వార్డులను వైసీపీ గెలుచుకోవడంతో.. స్వతంత్ర అభ్యర్థులు సైతం అధికార పార్టీకి మద్దతు ప్రకటించారు.
దీంతో వైసీపీకి భారీ మెజార్టీ దక్కడంతో.. మూడు సార్లు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దీంతో పలువురు కార్పొరేటర్లు.. కూటమిలోని పార్టీల్లో చేరారు. దీంతో ప్రస్తుతం కౌన్సిల్‌లో కూటమి బలం 53కి చేరింది. అలాగే వైసీపీ బలం 38కి తగ్గింది.
దీంతో గత ఏడాది జూలైలో జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత మేయర్ గొలగాని హరివెంకట కుమారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు ప్రారంభమైనాయి. కానీ అవిశ్వాసం పెట్టాలంటే కనీసం నాలుగేళ్లు పదవీకాలం పూర్తవ్వాలనే నిబంధన మునిసిపల్ చట్టంలో ఉంది. దీంతో అది వీలు కాలేదు. అయితే మార్చి 18వ తేదీకి మేయర్ పదవి చేపట్టి ఆమె నాలుగేళ్లు పూర్తవడంతో కూటమి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
అందులోభాగంగా ఆమెపై ఇటీవల అవిశ్వాస తీర్మానంకు సంబంధించిన నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఆ క్రమంలో వైసీపీ కార్పొరేటర్లను రక్షించుకునే పనిలో వైసీపీ నిమగ్నమైంది. అందులోభాగంగా వారిని బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Mayor Suresh Babu: కడప గడ్డపై వైసీపీ షాక్
Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు
Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..
T Congress Leaders: ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. కేబినెట్ కూర్పుపై కసరత్తు
For AndhraPradesh News And Telugu News