Share News

AP News: ఏలూరులో రెచ్చిపోయిన లేడీ రౌడీషీటర్

ABN , Publish Date - Jan 01 , 2025 | 04:41 PM

Andhrapradesh: మర్రిబంధం గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్‌ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు.

AP News: ఏలూరులో రెచ్చిపోయిన లేడీ రౌడీషీటర్
Eluru District

ఏలూరు జిల్లా, జనవరి 1: ఏలూరులో (Eluru District) లేడీ రౌడీషీటర్ ఆగడాలు ఎక్కువయ్యాయి. తనదే ఇష్టారాజ్యంగా ఆ లేడీ రౌడీ షీటర్ రెచ్చిపోతోంది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే వారిపై ఎలాంటి దుశ్చర్యలకైనా పాల్పడేందుకు సిద్ధపడింది ఆ లేడీ. బ్యాంకు మేనేజర్‌గా ఉంటూ అనేక అవీనితికి పాల్పడటంతో సస్పెండ్‌ గురైంది. అంతే కాకుండా తనను ఎదురించే వారిపట్ల ఎంతో కర్కషంగా ప్రవర్తిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఓ రైతు విషయంలో కూడా లేడీ రౌడీ షీటర్ ఇలానే రెచ్చిపోయింది. తన మాట వినకుండా ప్రవర్తిస్తున్నాడంటూ రౌతు పట్ల ఆ రౌడీషీటర్ దురుసుగా ప్రవర్తించింది. అంతే కాకుండా తన అనుచురులతో కలిసి రైతుపై దాడి చేసింది. ఇంతకీ ఎవరా లేడీ రౌడీ షీటర్.. ఆమె దురాగతాలను ఇప్పుడు తెలుసుకుందాం. అన్యాయమని ప్రశ్నించినందు రైతుని లేడీ రౌడీ షీటర్ స్థంభానికి కట్టేసి మరీ కొట్టింది. ఏలూరు జిల్లా నూజివీడు మండలం మర్రిబంధం గ్రామంలో రోజుకు రోజుకు లేడీ రౌడీ షీటర్ దావులూరి ప్రభావతి ఆగడాలు పేట్రేగిపోతున్నాయి.


గ్రామానికి చెందిన దోనపల్లి వెంకట్రావు గత కొంతకాలంలో లేడీ షీటర్‌ చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఆమె ఆగడాలపై వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. దీంతో వెంకట్రావును ఎలాగైనా భయపెట్టాలని భావించిన పద్మావతి సమయం కోసం ఎదురు చూసింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న వెంకట్రావును ప్రభావతి, ఆమె అనుచరులు పట్టుకున్నారు. కొంతకాలంగా తన మాట వినకుండా గ్రామ కార్యక్రమాల్లో వ్యతిరేకంగా ప్రవర్తిస్తూడన్న కోపంతో వెంకట్రావును వాటర్ ట్యాంక్ స్థంభంకు కట్టేసి.. ఆపై దాడి చేశారు. గతంలో ప్రభావతి బ్యాంకు మేనేజర్ విధులు నిర్వహించారు. అయితే ఆ వృత్తిలో ఉంటూ అవినీతి ఆరోపణలకు పాల్పడటంతో ప్రభావతిని అధికారులు సస్పెండ్ చేశారు.


అలాగే ప్రభావతిపై పలు ప్రాంతాల్లో అధిక స్థాయిలో కేసులు నమోదు కావడంతో ఆమెపై నూజివీడు సర్కిల్ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. అయితే వెంకట్రావును స్తంభానికి కట్టేసి తీవ్రంగా గాయపరచారు పద్మావతి, ఆమె అనుచరులు. తీవ్ర గాయాలతో అరుపులు, కేకలు పెడుతున్న బాధితుడు వెంకట్రావును గమనించిన గ్రామస్తులు... పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకట్రావును అక్కడి నుంచి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పాత గొడవల నేపథ్యంలో తనపై ప్రభావతి అనుచరవర్గం దాడి చేసి హత్య చేసేందుకు కుట్ర పన్నారని పోలీసులకు బాధితుడు వివరణ ఇచ్చాడు. వెంటనే వెంకట్రావును నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు విషయం తెలిసిన జనసేన పార్టీ నేతలు.. ఏలూరు ఆస్పత్రికి వచ్చి బాధితుడిని పరామర్శించారు.


ఇవి కూడా చదవండి..

ఇతగాడి దెబ్బకు బ్రీత్ ఎనలైజర్ వణికిపోయిందిగా

న్యూఇయర్ సందర్భంగా ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 01 , 2025 | 04:41 PM