2025 HorosCope : బాబా వంగా ప్రకారం.. అదృష్టమంటే ఈ రాశివారిదే.. ఈ సంవత్సరం చాలా డబ్బు సంపాదిస్తారు..
ABN , Publish Date - Feb 26 , 2025 | 02:30 PM
2025 HorosCope : బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగాను కాలజ్ఞానిగా అభివర్ణిస్తారు. ఈమె చెప్పినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంఘటనలు నిజమయ్యాయి. అలాగే 2025 ఈ రాశులవారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని.. ఊహించనివిధంగా చాలా డబ్బు సంపాదిస్తారని బాబా వంగా అన్నారు. అందులో మీరూ ఉన్నారేమో తెల్సుకోండి..

2025 HorosCope : 1911 బల్గేరియాలో పుట్టిన బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేలియా దిమిత్రోవా. వైద్యురాలైన ఈమెకు బాల్యం నుంచి కంటి చూపు లేదు. ఆధ్యాత్మికవేత్తగా మారాక రాబోయే కాలంలో జరగబోయే ఎన్నో విషయాలను కచ్చితంగా అంచనా వేశారు. 1997లో ప్రిన్సెస్ డయానా మరణం, 2001లో న్యూయార్క్ ట్విన్ టవర్స్ కూలిపోవడం, రష్యా-ఉక్రెయిన్ వివాదం ఇలా ఎన్నో సంఘటనలు బాబా వంగా చెప్పినట్టే జరిగాయి. అందుకే ఈమెను నోస్ట్రాడామస్‌తో పోలుస్తారు. 1996లో మరణించినా ఇప్పటికీ బాబావంగా జ్యోతిష్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయవేత్తలు, ప్రముఖులు విశ్వసిస్తారు. 2025లో ఏ రాశులవారిని అదృష్టం వరించబోతుందో కూడా ఆమె చెప్పారు. వారు మీరు కావచ్చేమో తెలుసుకోండి..
మేషరాశి
బాబా వంగా ప్రకారం, 2025 సంవత్సరం మొత్తం మేష రాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశివారికి కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఊహించనంత డబ్బు సంపాదిస్తారు. ప్రధానంగా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం వల్ల డబ్బు సంపాదిస్తారు. అదృష్టం వీరి వెన్నంటే ఉండటం వల్లే సవాళ్లను సులువుగా దాటుకుని విజయం సాధించగలుగుతారు. కాస్త పట్టుదల, ఓర్పు, ధైర్యం కోల్పోకుండా ప్రయత్నిస్తే వీరికిక తిరుగుండదు.
కుంభ రాశి
ఈ సంవత్సరం కుంభ రాశి వారి దురదృష్టం పూర్తిగా తొలగిపోతుందని బాబా వంగా అంచనా వేశారు. శని గ్రహం బలమైన ప్రభావంతో కుంభ రాశివారు సృజనాత్మక శక్తి పెరుగుతుంది. అద్భుతమైన ఆలోచనలు చేసి చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. పరిమితులను అధిగమించి ధైర్యంగా లక్ష్యాలను సాధించగలుగుతారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకుంటారు. పూర్తి సామర్థ్యాన్ని వెలికితీసి కెరీర్‌లో ఉన్నత శిఖరాలను సాధించడంలో ఈ ఏడాది వీరికి గొప్ప సహాయం అందిస్తుంది.
వృషభ రాశి
వృషభ రాశి వారు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తులు. ఆర్థిక విషయాల గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు తమ వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఈ వ్యక్తులు దీర్ఘకాలిక పెట్టుబడులు పెడితే ఈ ఏడాది వీరికి ఆర్థిక స్థిరత్వం, వృద్ధి లభిస్తుంది. పట్టుదలతో సంపదను సృష్టించడంపై దృష్టి సారిస్తే ఈ రాశివారు సులువుగా ధనవంతులు కాగలరని బాబా వంగా అంచనా వేశారు. అయితే, వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
సింహ రాశి
ఈ రాశిలో జన్మించిన వారు 2025లో ఆర్థిక భవిష్యత్తుపై దృష్టిపెడితే సత్ఫలితాలు పొందుతారు. వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి సాధిస్తారు. చురుగ్గా వివేకంతో వ్యవహరించి లాభదాయకమైన పెట్టుబడులు పెట్టడం మంచిది. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి, వ్యక్తిగత శ్రేయస్సును మెరుగుపరచుకోవడానికి ఈ ఏడాది వీరికి అనుకూల ఫలితాలను ప్రసాదించబోతోంది. భావోద్వేగపరమైన ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొని మరింత నమ్మకంగా, స్పష్టంగా ఉండగలుగుతారు. జూన్‌లో కుజుడు సింహ రాశిలోకి ప్రవేశించేలోపుగా లక్ష్యసాధనకు బలమైన పునాది వేసుకోవడం గురించి కృషి చేయాలి.
మిథున రాశి
బాబా వంగా చెప్పిన ప్రకారం ఐదవ రాశి మిథున రాశి. 2025 లో మిథున రాశి వారు చాలా ఆర్థిక ప్రయోజనాలను పొందబోతున్నారు. ఈ సంవత్సరం వారికి చాలా డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు లభిస్తాయి. మిథున రాశి వ్యక్తులు వ్యాపార, కమ్యూనికేషన్ రంగాలలో బాగా రాణించగలుగుతారు. వీరు సులభంగా నెట్‌వర్క్‌లను సృష్టించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. దాని కారణంగా ఇతరులను ప్రభావితం చేసి లక్ష్యం దిశగా అడుగులు వేయగలుగుతారు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెడితే ఆర్థిక అద్భుత పురోగతిని సాధించగలరు.
Read Also : Zodiac Sign : కొత్త ఏడాదిలో అదృష్టం
Astro Tips : పాత బట్టలను దానం చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..
Zodiac signs: మీరు ఈ రాశిలో పుట్టారా..
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి