Minimum Salary: 8వ వేతన సంఘం ప్రకారం కనీస జీతం రూ. 51,480.. మరిన్ని ప్రయోజనాలు కూడా..
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:56 PM
కేంద్ర ప్రభుత్వం ఇటివల 8వ వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇకపై ఉద్యోగుల కనీస ప్రాథమిక వేతనం రూ. 51,480కు చేరుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ చూద్దాం.

కేంద్ర ప్రభుత్వం ఇటివల 8వ వేతన సంఘం ఏర్పాటును (8th Pay Commission) ప్రకటించింది. ఈ నిర్ణయంతో 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో ఉద్యోగుల మూల జీతం 20% నుంచి 25% వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా 8వ వేతన సంఘం వివిధ వర్గాలకు ఎలా ప్రయోజనాలను అందించబోతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఎవరికి ఎంత ప్రయోజనం కలుగుతుంది?
AG ఆఫీస్ బ్రదర్‌హుడ్ మాజీ అధ్యక్షుడు హరిశ్చంద్ర తివారీ మాట్లాడుతూ, లెవల్ 6 నుంచి 12 వరకు ఉన్న ఉద్యోగుల ప్రాథమిక జీతం (Minimum Salary) దాదాపు 20% పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ పెరుగుదలతో పాటు, వారి HRA (ఇంటి అద్దె భత్యం), రవాణా భత్యం కూడా పెరుగుతాయి. మరోవైపు లెవల్ 1 నుంచి 5 వర్గం ఉద్యోగులకు మూల వేతనంలో దాదాపు 25% పెరుగుదల ఉండబోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కేటగిరీ ఉద్యోగులకు కూడా HRA, రవాణా భత్యం పెరుగుతాయి.
కోటి మందికి ప్రయోజనం
ఈ నిర్ణయం 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, రక్షణ సిబ్బందికి ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే 65 లక్షల మంది పెన్షనర్లు కూడా తమ పెన్షన్, ఇతర ప్రయోజనాలలో పెరుగుదలను అందుకుంటారు. ఈ మార్పులు పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందువల్ల ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కనీస వేతనంలో భారీ పెరుగుదల
గత వేతన సంఘం జనవరి 2016న కనీస ప్రాథమిక జీతాన్ని రూ. 7,000 నుంచి రూ. 18,000కి పెంచింది. అయితే ఈసారి 8వ వేతన సంఘం నిర్ణయంతో కనీస జీతం 186% పెరిగి రూ. 51,480కి చేరుకునే అవకాశం ఉందని కింగ్ స్టబ్ & కాసివా న్యాయ సంస్థ భాగస్వామి రోహితశ్వ సిన్హా చెప్పారు. అదే విధంగా పనితీరు ఆధారిత జీతాల పెంపుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగులు తమ పనితీరు బట్టి అదనపు ప్రయోజనాలు పొందే అవకాశాన్ని కలిగిస్తుంది. మెరుగైన పనితీరు కనబరిచే ఉద్యోగులు ఈ జీతాల పెంపుతో మంచి ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.
8వ వేతన సంఘంలో ముఖ్య మార్పులు
జీతాలు: అన్ని లెవళ్లలో ఉద్యోగులకు 20% నుంచి 25% పెరుగుదల
HRA & రవాణా భత్యం: పెరిగే అవకాశాలు
కనీస వేతనం: ఈసారి రూ. 51,480కి చేరుకునే ఛాన్స్
పెన్షన్లు: పెన్షనర్లకు కూడా పెరుగుదల
పనితీరు ఆధారిత జీతం: మెరుగైన పనితీరు ఉన్న ఉద్యోగులకు అదనపు ప్రయోజనాలు
ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాలు మరింత మెరుగుపడతాయి. 8వ వేతన సంఘం తలపెట్టిన ఈ మార్పులతో, ఉద్యోగులు, పెన్షనర్లు ఆర్థిక సాయం పొందుతారు. పెన్షన్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ పదవీ విరమణ ప్రయోజనాల్లో కూడా మార్పులు ఉండవచ్చు.
ఇవి కూడా చదవండి:
EV Launch: 500 కి.మీ రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ప్రముఖ సంస్థ లాంచ్
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News