Bank Strike : కస్టమర్లకు గుడ్ న్యూస్.. నిర్ణయం మార్చుకున్న బ్యాంకు సంఘాలు.. సమ్మె జరిగేది ఎప్పుడంటే..
ABN , Publish Date - Mar 21 , 2025 | 07:01 PM
Bank Strike : కస్టమర్లకు గుడ్ న్యూస్. మార్చి 24, 25 తేదీలలో సమ్మెకు పిలుపునిచ్చిన బ్యాంకు సంఘాలు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి. దీంతో సమ్మె ఆలోచనను ఆ రోజు వరకూ వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Bank Strike : బ్యాంకు సమ్మె పిలుపును యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఉపసంహరించుకుంది. సమ్మె ఆలోచనను ప్రస్తుతానికి విరమించుకున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మార్చి 24, 25 తేదీలలో బ్యాంకు సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే తాజాగా సమ్మెను విరమించుకున్నట్లు సమాచారం. అంటే మార్చి 24, 25 తేదీలలో సమ్మె ఉండదు. బ్యాంకులు తెరిచే ఉంటాయి. సమ్మెను ఒకటి నుండి రెండు నెలల పాటు నిలిపివేసినట్లు UFBU తెలిపింది.
విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, భారత బ్యాంకింగ్ సంఘం మధ్య సమావేశం జరిగింది. ఆ సమావేశం తర్వాత బ్యాంకు సంఘాలు సమ్మెను తాత్కాలికంగా విరమించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇంతలోనే బ్యాంకు సమ్మె రద్దుపై అసత్య వార్తలు వ్యాపించడంతో బ్యాంకు కస్టమర్లలో ఆందోళన చెలరేగింది. బ్యాంకుల సమ్మె జరిగితే పనులు వాయిదా పడతాయేమో అనే భయంతో ఉన్న సామాన్యులు ఈ వార్త ఉపశమనం కలిగించేదే. జాతీయ మీడియా ప్రకారం బ్యాంకు సమ్మెను ప్రస్తుతానికి విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ మధ్యలో జరిగే సమావేశం తర్వాత సమ్మెపై కొత్త నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
Indian Rupee: రెండేళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థకు గుడ్ న్యూస్..పెరిగిన రూపాయి విలువ
Stock Market: వరుసగా ఐదో రోజూ లాభాలే.. 77 వేలు దాటిన సెన్సెక్స్..