Share News

Bank Unions : బ్యాంకుల సమ్మె వాయిదా

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:37 AM

వచ్చే సోమ, మంగళవారాల్లో చేయతలపెట్టిన రెండు రోజుల సమ్మెను బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (యూఎప్‌బీయూ) వాయుదా వేసింది.

Bank Unions : బ్యాంకుల సమ్మె వాయిదా

న్యూఢిల్లీ: వచ్చే సోమ, మంగళవారాల్లో చేయతలపెట్టిన రెండు రోజుల సమ్మెను బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక (యూఎప్‌బీయూ) వాయుదా వేసింది. ఐదు రోజుల పని, అన్ని క్యాడర్లలోనూ తగినన్ని నియామకాలు చేపట్టాలన్న తమ డిమాండ్ల విషయంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) నుంచి సానుకూల హామీ లభించిన నేపథ్యంలో సమ్మె వాయిదా వేస్తున్నట్టు 9 బ్యాంకు యూనియన్ల ఐక్య వేదిక యూఎప్‌బీయూ ప్రకటించింది.

Updated Date - Mar 22 , 2025 | 12:37 AM