Credit Card: ఓర్నీ..క్రెడిట్ కార్డ్ వద్దని బ్లాక్ చేసినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా..
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:27 PM
క్రెడిట్ కార్డు వినియోగించే అలవాటు అనేక మందికి ఉంటుంది. కొంత మంది మాత్రం వీటి నుంచి వచ్చే వడ్డీల భారం తట్టుకోలేక వీటిని బ్లాక్ చేయడం లేదా తొలగింపు చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల కూడా సిబిల్ స్కోరుపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అనేక మంది ఉద్యోగులు క్రెడిట్ కార్డులను విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే ఒకానొక సమయంలో ఆలస్యంగా చెల్లించే క్రెడిట్ కార్డ్ బిల్లులను చూసిన ఆయా వ్యక్తులు ఇక వద్దురా బాబు క్రెడిట్ కార్డులని భావిస్తారు. ఆ క్రమంలో పలువురు క్రిడెట్ కార్డ్ బిల్ సెటిల్ మెంట్ కోసం వెళితే, మరికొంత మంది మాత్రం ఆ మొత్తం బిల్లు చెల్లించి వాటిని క్లోజ్ చేసుకుంటారు. కానీ మీ క్రెడిట్ కార్డ్‌ను క్లోజ్ చేసినా కూడా మీ CIBIL స్కోర్‌పై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ పరిమితి
మీ క్రెడిట్ కార్డ్ ఖాతా క్లోజ్ లేదా బ్లాక్ చేయడం వల్ల మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. అంటే మీ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయడం వల్ల, మీకు అందుబాటులో ఉన్న మొత్తం క్రెడిట్ పరిమితి తగ్గిపోతుంది. ఉదాహరణకు మీకు రెండు క్రెడిట్ కార్డులు ఉంటే, ఒకటి రూ. 50,000, మరొకటి రూ. 30,000 పరిమితితో ఉంటే, మీరు మొత్తం రూ. 80,000 పరిమితి కలిగి ఉంటారు.
తక్కువ వినియోగ నిష్పత్తి
మీరు రూ. 40,000 ఖర్చు చేసినప్పుడు, క్రెడిట్ వినియోగ నిష్పత్తి 50% ఉంటుంది. అయితే వీటిలో ఒక కార్డును బ్లాక్ చేస్తే, మీకు రూ. 50,000 మాత్రమే అందుబాటులో ఉంటుంది. అప్పుడు రూ. 40 వేల మీ వినియోగ నిష్పత్తి 80%కి చేరుకుంటుంది. ఆ క్రమంలో రుణదాతలు లేదా క్రెడిట్ బ్యాంకులు సాధారణంగా తక్కువ వినియోగ నిష్పత్తిని ఇష్టపడతారు. ఎందుకంటే ఇది మీకు క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగిస్తున్నట్టు సూచిస్తుంది. అధిక వినియోగ నిష్పత్తి ఉన్నవారికి రుణం ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ క్రమంలో మీరు మీ క్రెడిట్ కార్డులను బ్లాక్ చేసుకున్నా కూడా మీ సిబిల్ స్కోరుకు ఇబ్బందులు తప్పవు.
మీ క్రెడిట్ హిస్టరీ
అంతేకాదు మీకు ఉన్న పాత క్రెడిట్ కార్డులను, ముఖ్యంగా మీరు వాటిని చాలా కాలం ఉపయోగిస్తున్నట్లయితే, అది మీ క్రెడిట్ చరిత్రకు ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు క్రెడిట్‌ను ఎలా నిర్వహిస్తున్నారో అనే అంశాన్ని తెలియజేస్తుంది. మీ పాత క్రెడిట్ కార్డులను మూసివేస్తే మీ క్రెడిట్ హిస్టరీ తగ్గిపోతుంది. ఇది మీ CIBIL స్కోరును ప్రభావితం చేస్తుంది.
చెల్లింపుల చరిత్రపై ప్రభావం
మీరు క్రెడిట్ కార్డ్‌తో చేసిన అన్ని చెల్లింపుల చరిత్ర కూడా మీ CIBIL స్కోరుకు ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు, మీరు పాత కార్డుపై బిల్లులను సకాలంలో చెల్లింపులు చేస్తే, అది మీ క్రెడిట్ స్కోరును మెరుగుపరుస్తుంది. అయితే మీ చెల్లింపులను ఆలస్యంగా చేయడం వల్ల మీ స్కోర్ క్షీణిస్తుంది. ఈ క్రమంలో మీరు కార్డ్‌ను మూసివేసినప్పటికీ, మిగతా క్రెడిట్ ఖాతాల విషయంలో సమయానికి చెల్లింపులు చేయడం ద్వారా మీ స్కోరును క్రమంగా మెరుగుపరుచుకోవచ్చు
ఇవి కూడా చదవండి:
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News