BSNL: బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. అపరిమిత కాలింగ్‌తోపాటు..
ABN , Publish Date - Jan 12 , 2025 | 04:12 PM
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మళ్లీ మిగతా టెలికాం ప్రొవైడర్లతో పోటీకి వచ్చింది. కేవలం వాయిస్ కాలింగ్ మాత్రమే అవసరమైన వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్ ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL మరోసారి క్రేజీ ఆఫర్‌తో వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను కంపెనీ ఎట్టకేలకు ప్రవేశపెట్టింది. జియో, ఎయిర్ టెల్, విఐ (Vi) వంటి ప్రైవేట్ ప్రొవైడర్లతో పోటీ పడుతున్న BSNL, ఇప్పుడు ఒక కొత్త వాయిస్ కాలింగ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు. కానీ అపరిమిత వాయిస్ కాలింగ్ తోపాటు మెసేజ్ సౌకర్యం కూడా ఉంటుంది.
అనేక రోజులుగా..
చాలా కాలంగా జియో, ఎయిర్ టెల్, విఐ వంటి ప్రొవైడర్ల నుంచి వాయిస్ కాలింగ్ సేవలను మాత్రమే అందించే రీఛార్జ్ ప్లాన్లు అందించాలని అనేక మంది మొబైల్ వినియోగదారులు కోరారు. గ్రామాల్లో ఉండే సాధారణ వినియోగదారులకు డేటా ప్యాక్స్ అవసరం లేకపోయినా, వాయిస్ కాలింగ్ తోపాటు ప్రస్తుత ప్లాన్లలో డేటా ప్యాక్స్ కోసం మనీ చెల్లించాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ, ఇప్పుడు BSNL ఒక సరికొత్త ఆఫర్‌ను వినియోగదారులకు ప్రవేశపెట్టింది.
BSNL కొత్త వాయిస్ కాలింగ్ ప్లాన్
ఈ క్రమంలో BSNL 439 రూపాయల ధరతో ఒక ప్రత్యేక ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ వినియోగదారులకు 90 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ సేవలను అందిస్తుంది. ప్రధానంగా ఈ ప్లాన్‌లో డేటా ఉండదు. అంటే వినియోగదారులు డేటా ప్యాక్స్ కోసం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ రీఛార్జ్ ప్లాన్ ప్రస్తుత ఇతర వినియోగదారులకు చెల్లింపుల్లో ఉపశమనం కలిగిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాల్స్ మాత్రమే కాకుండా, వినియోగదారులు ఈ రీఛార్జ్‌లో చేర్చబడిన కాంప్లిమెంటరీ SMS సేవల ప్రయోజనం కూడా పొందుతారు.
ఇంటర్నెట్ లేకున్నా కూడా..
BSNL ఈ కొత్త ప్లాన్‌ను ప్రత్యేకంగా డేటా అవసరం లేని వినియోగదారుల కోసం రూపొందించబడింది. దేశవ్యాప్తంగా ఎంతో మంది వినియోగదారులు మొబైల్ ఇంటర్నెట్‌ని వాడకుండా, కేవలం వాయిస్ కాలింగ్ కోసం మొబైల్ ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ వారందరికీ చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం దేశంలో చాలా మంది వినియోగదారులు ఇంటర్నెట్ డేటాను వాడటం లేదని, కానీ ఇప్పటికీ పలు సంస్థలు రీఛార్జ్‌లో డేటా ప్యాక్స్ చెల్లిస్తున్నామని ఆందోళన చెందిన వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Airtel, Vi కూడా పలు రీఛార్జ్ ఆఫర్లను అందిస్తున్నారు. కానీ BSNL 439 రూపాయల ప్లాన్ వంటి ప్రత్యేక రీఛార్జ్ ఆఫర్ మాత్రం అందుబాటులో లేదు. డేటా లేకుండా వాయిస్ కాలింగ్ అవసరమున్న వినియోగదారుల కోసం ఇది మంచి ఎంపికగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
YouTube Premium Free: జియో క్రేజీ ఆఫర్.. రెండేళ్లు యూట్యూబ్ ప్రీమియం ఫ్రీ..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు.
Read More Business News and Latest Telugu News