BSNL 5G Services: దేశంలో BSNL 5G అమలుపై..కేంద్ర మంత్రి కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 24 , 2025 | 08:14 PM
మీరు ప్రైవేటు టెలికాం సంస్థల ఖరీదైన రీఛార్జ్ ప్లాన్లతో విసిగిపోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మరికొన్ని రోజుల్లో దేశంలో BSNL 5జీ సేవలు మొదలు కానున్నాయి. ఈ విషయాన్ని తాజాగా కేంద్ర మంత్రి ప్రకటించారు.

దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 5జీ గురించి అనేక మందికి సందేహాలు ఉన్నాయి. ప్రత్యేకంగా BSNL 5G సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారు, ఎప్పుడు అమల్లోకి వస్తాయనే ప్రశ్నలు ఉన్నాయి. ఇలాంటి అనేక విషయాలపై తాజాగా కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ ఇచ్చారు.
అధిక సామర్థ్యంతో..
కేంద్ర మంత్రి చెప్పిన ప్రకారం BSNL 4G సేవల విస్తరణ ప్రక్రియ 2025 జూన్ నాటికి పూర్తవుతుంది. ఆ తర్వాత 5G సేవల విస్తరణ వచ్చే జూన్ నుంచి మొదలవుతుందని వెల్లడించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తన అధికారిక X (మునుపటి ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఈ కీలక సమాచారాన్ని పంచుకుంది. గతంలో, కేంద్ర ప్రభుత్వం BSNLకి రూ. 80,000 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులు BSNL నెట్‌వర్క్‌ను అధిక సామర్థ్యంతో అభివృద్ధి చేయడానికి, 4G, 5G సేవలను మరింత మెరుగుపరచడానికి ఉపయోగించనున్నారు.
లక్ష కొత్త టవర్లు..
ప్రస్తుతం BSNL 5G సేవలను ప్రారంభించడానికి ముందు, సంస్థ తన 4G నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తుంది. దేశంలో 4G నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే పనిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం, BSNL దేశవ్యాప్తంగా 75,000 కంటే ఎక్కువ 4G టవర్లను ప్రారంభించగా, మరో 100,000 కొత్త 4G టవర్లను వచ్చే జూన్ నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు.
5Gకి అప్‌గ్రేడ్ అవడం..
ఈ క్రమంలో 4G సేవల విస్తరణను పూర్తిచేసిన తరువాత, BSNL తన నెట్‌వర్క్‌ను 5Gకి అప్‌గ్రేడ్ అవడం ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో జూన్ 2025లో 5G సేవలు మొదలు కావచ్చని కేంద్ర మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది BSNL వినియోగదారులకు నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. అంతేకాదు 5జీ నెట్‌వర్క్ మొదలైన తర్వాత ప్రైవేట్ టెలికాం సంస్థల నుంచి అనేక మంది యూజర్లు BSNL వైపు మారే అవకాశం ఉంది.
మౌలిక సదుపాయాలు
BSNL ప్రస్తుతం 3G సేవలను దశలవారీగా తొలగించి 4G సేవల కోసం కొత్త స్పెక్ట్రమ్‌ను అమలు చేస్తోంది. టెలికాం రంగంలో పెద్ద కంపెనీల మధ్య పోటీని చూస్తే, BSNL కూడా ప్రస్తుతం 4G, 5G సేవలకు కావలసిన స్పెక్ట్రమ్‌ను వేగంగా ఖాళీ చేయడం ద్వారా మార్పులు చేసుకుంటోంది. తద్వారా, జూన్ 2025లో 4G నుంచి 5G సేవలకు మారే విధానం మరింత సులభం అవుతుంది. 2024 జూలైలో ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత..లక్షలాది మంది వినియోగదారులు BSNLకి పోర్ట్ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ టెలికాం సంస్థలు తరచుగా చౌక ధర ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Amazon: గుడ్ న్యూస్..ఈ ఛార్జీలను తొలగించిన అమెజాన్..
Single Recharge: ఒకే రీఛార్జ్‌తో ముగ్గురికి ఉపయోగం..సరికొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన బీఎస్‌ఎన్‌ఎల్
Layoffs: ఎంది సామి..మళ్లీ 9 వేల లే ఆఫ్స్, ఇక మిగిలేది ఎవరు..
Recharge Offer: క్రేజీ ఆఫర్..రూ.5కే డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్..
NASSCOM: వచ్చే రెండేళ్లలో లక్ష మంది విద్యార్థులకు ఉచితంగా ఏఐ శిక్షణ
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
Read More Business News and Latest Telugu News