CII: కేంద్ర బడ్జెట్ 2025-26లో వీటిపై ఫోకస్ చేయాలి
ABN , Publish Date - Jan 06 , 2025 | 07:57 PM
వచ్చే కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రధానంగా యువతకు ఉపాధి వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ తెలిపింది. అందుకు సంబంధించిన నివేదికను ప్రకటించిన కీలక అంశాలను ప్రస్తావించింది.
వచ్చే యూనియన్ బడ్జెట్ 2025-26లో (budget 2025) భారతదేశంలో ఉద్యోగాల సృష్టి, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి అంశాలపై ఫోకస్ చేయాలని CII (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) కోరింది. యూనియన్ బడ్జెట్ 2025-26లో ముఖ్యంగా ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ బడ్జెట్ ద్వారా భారతదేశంలో పెరిగిన జనాభా డివిడెండ్‌ను సద్వినియోగం చేసుకోవాలని, యువతను అందులో భాగం చేయాలని కోరింది.
దేశంలో యువ జనాభా..
CII నివేదిక ప్రకారం భారతదేశం ప్రస్తుతం 145 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి ఉంది. ఈ సమాహారంలో 29 సంవత్సరాల మధ్య వయస్సు వారి జనాభా ఎక్కువగా ఉంది. ఇది ఒక చరిత్రాత్మక అవకాశాన్ని సూచిస్తుందని ఈ సందర్భంగా నివేదిక తెలిపింది. 2050 నాటికి 133 మిలియన్ల మంది యువత పని చేసే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఈ యువతను ఉత్పాదకంగా వాడుకోవడం దేశానికి అత్యంత అవసరమవని రిపోర్ట్ స్పష్టం చేసింది.
యువతకు అవకాశాలు
అయితే సీఐఐ అభిప్రాయానికి అనుగుణంగా రాబోయే బడ్జెట్ ద్వారా ఉపాధి కల్పనను ప్రోత్సహించడానికి పలు పథకాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ప్రత్యేకంగా యువతకు సంబంధించిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకాలు ఉండనున్నాయి. తద్వారా ఉద్యోగాల విషయంలో ప్రకటనలు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతోపాటు సమగ్ర జాతీయ ఉపాధి విధానం, వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో అమలులో ఉన్న ఉపాధి కల్పన పథకాలను యువతకు అవకాశాలు పెంచడానికి దోహదపడతాయని నివేదిక తెలిపింది.
ప్రత్యేక మినహాయింపులు
సీఐఐ తన డిమాండ్‌లలో కొత్త ఉపాధిని ప్రోత్సహించడానికి సెక్షన్ 80JJAA స్థానంలో కొత్త విభాగం పెట్టాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇది పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక రాయితీ స్కీమ్ అందించడానికి దారితీస్తుంది. అలాగే కొత్త నియమాల ద్వారా మూడు సంవత్సరాల పాటు కొత్త ఉద్యోగాలకు సంబంధించిన జీతానికి ప్రత్యేక మినహాయింపును అనుమతించవచ్చని పేర్కొన్నారు. ఇది వ్యాపారాలు, వృత్తిని కొనసాగిస్తున్న పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనాన్ని పొందడంలో తోడ్పడుతుంది.
కృషి చేయాలి
CII పారిశ్రామిక వర్గాల నియామకాలను ప్రోత్సహిస్తూ, యువతను వినియోగించుకోవడం అవసరం అని ప్రస్తావించింది. ఇది భారతదేశంలో ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక పరంగా ప్రగతి సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వ విభాగం, ప్రైవేట్ పరిశ్రమలు, ఇతర వ్యాపార సంస్థలు వంటి అనేక ప్రాంతాల్లో యువతకు అవకాశాలు అందించడంలో కృషి చేయాలని నివేదిక ప్రస్తావించింది.
రాబోయే బడ్జెట్ 2025-26లో ఉద్యోగాల సృష్టిని ప్రాముఖ్యతతో చూడటం ద్వారా దేశాన్ని ఆర్థికంగా మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని రిపోర్ట్ అంచనా వేసింది. భవిష్యతుపై దృష్టి సారించడం, ఉద్యోగాలను సృష్టించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం అంటే ఇది సమాజానికి ఒక మంచి చేయడమేనని CII తెలిపింది. ఈ క్రమంలో వ్యూహాత్మక అభివృద్ధికి దారితీసే మార్గాలలో యువతకు అవకాశం కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి:
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News