Share News

Budget 2025: బడ్జెట్‌ ప్రతులను మీడియాకు ఎందుకు చూపిస్తారో తెలుసా..

ABN , Publish Date - Feb 01 , 2025 | 11:16 AM

Budget 2025: ఇండియాకు గుర్తుగా.. వారసత్వం, స్వతంత్ర పరిపాలనకు గుర్తుగా భావిస్తారు. మన దేశ బడ్జెట్‌ను మనమే ప్రజెంట్ చేస్తున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్‌ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని పాటిస్తూ 2019కి ముందు వరకు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. కానీ ఈ సంప్రదానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు.

Budget 2025: బడ్జెట్‌ ప్రతులను మీడియాకు ఎందుకు చూపిస్తారో తెలుసా..
Budget 2025

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టే ముందే బడ్జెట్ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతూ వస్తుంది. అసలు ఎందుకు బడ్జెట్‌ ప్రతిని మీడియాకు ఎందుకు చూపిస్తారు. దీనికి వెనక అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ ప్రతిని మీడియాకు చూపించారు. బడ్జెట్‌కు ముందు ఆ ప్రతిని మీడియాకు చూపించడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చూపించడాన్ని బహీ ఖాతా అని పిలుస్తారు.


ఇండియాకు గుర్తుగా.. వారసత్వం, స్వతంత్ర పరిపాలనకు గుర్తుగా భావిస్తారు. మన దేశ బడ్జెట్‌ను మనమే ప్రజెంట్ చేస్తున్నామనే దానికి గుర్తుగా ఇలా బడ్జెట్‌ ప్రతిని మీడియాకు చూపించడం జరుగుతుంది. బ్రిటీష్ కాలం నాటి ఆచారాన్ని పాటిస్తూ 2019కి ముందు వరకు బడ్జెట్ ప్రతులను బ్రీఫ్ కేసుల్లో తీసుకెళ్లేవారు. కానీ ఈ సంప్రదాయానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వస్తి పలికారు. ఆ తరువాత బహి ఖాతాను తెరపైకి తీసుకొచ్చారు. 2019 నుంచి ఇలా బడ్జెట్‌ ప్రతులను ఎర్రటి వస్త్రంలో చుట్టి పార్లమెంటుకు తీసుకెళ్లడం జరుగుతోంది.


స్వాతంత్ర్యం తరువాత ఆర్థికశాఖ మంత్రి జాన్ మాతయ్ 1950లో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఆయన బడ్జెట్ ప్రతులను లోపలకు తీసుకెళ్లకుండానే బడ్జెట్‌ను ప్రసంగించారు. ఆ తరువాత నుంచి వచ్చిన ఆర్థిక మంత్రులు ప్రతీఒక్కరూ బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌లోకి తీసుకెళ్లడం జరుగుతూ వస్తోంది. అయితే బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం లభించడంతో.. బ్రిటీష్ వారితో సంబంధం లేదని.. మన బడ్జెట్ మన సొంతం అనేదానికి సంకేతంగా బడ్జెట్‌ ప్రతిని మీడియాకు చూపిస్తూ వస్తున్నారు కేంద్ర ఆర్థిక మంత్రులు. గతంలో బడ్జెట్ ప్రతులను చూస్తూ ప్రసంగించే వారు కేంద్ర ఆర్థిక మంత్రులు. కానీ ప్రధాన నరేంద్ర మోదీ అధికారంలో వచ్చాక బడ్జెట్ ప్రతుల ప్లేస్‌లో ట్యాబ్‌లు వచ్చేశాయి. 2021 నుంచి పేపస్‌ లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ట్యాబ్‌లలో చూసి ప్రసంగించడం మొదలు పెట్టారు నిర్మాలా సీతారామన్. ఇది ఆత్మనిర్మర భారత్‌కు గుర్తుగా ఉంటుందని తెలిపారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.


ఇవి కూడా చదవండి..

Union Budget: బడ్జెట్‌లో ఆ రాష్ట్రాలకు నిధుల వరద.. అసలు సంగతి ఏమిటంటే

గూగుల్‌ను నమ్ముకొని కొండల్లోకి..

Read Latest National News And Telugu News

Updated Date - Feb 01 , 2025 | 12:48 PM