Gold Rates: ఉన్నట్టుండి పెరిగిన బంగారం ధర.. సడన్ షాక్ ఇచ్చిందిగా..
ABN , Publish Date - Jan 09 , 2025 | 09:12 AM
Gold And Silver Rates: మహిళలకు బిగ్ షాక్. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పసిడి ఊహించని షాక్ ఇచ్చింది. ఇవాళ గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..
గతేడాది బంగారం ధరలు కాస్త తగ్గుతూ వచ్చాయి. దీంతో మహిళలతో పాటు గోల్డ్ లవర్స్ కొనుగోళ్లకు చాలా ఆసక్తి చూపించారు. కొత్త ఏడాది పసిడి మరింత దిగొస్తుందని భావించారు. కొని దాచుకోవాలని భావించారు. మ్యారేజ్ సీజన్ సమయంలో ధరలు కొండెక్కుతాయి కాబట్టి ఇప్పుడే కొనేస్తే బెటర్ అని భావించారు. కానీ పసిడి తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతోంది. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి కూడా గోల్డ్ రేట్స్ భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా ధరలు పెరిగాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా కొండెక్కింది గోల్డ్. ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయి? గోల్డ్ రేట్స్ పెరగడానికి గల కారణాలు ఏంటి? అనేది ఇప్పుడు మనం చూద్దాం..
గోల్డ్ పైకి.. సిల్వర్ కిందకు..!
నాల్రోజుల తర్వాత గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో జనవరి 9, గురువారం ఉదయం చూసుకుంటే.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.100 పెరిగి.. రూ.72 వేల 250 దగ్గరకు చేరింది. అదే 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి రేటు రూ.110 పెరిగి తులం రూ.78 వేల 820 పలుకుతోంది. తగ్గుతూ పోతున్న గోల్డ్ మళ్లీ ఊపందుకోవడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే కారణమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక, బంగారం ధరలు పెరిగినా.. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతూ సిల్వర్ లవర్స్‌ను ఆకర్షిస్తోంది. ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,00,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. పైన పేర్కొన్న పసిడి, వెండి ధరలు గురువారం పొద్దున 7 గంటల టైమ్‌లో ఉన్నవి. వీటి ధరల్లో ఒక్కోసారి మధ్యాహ్నానికే మార్పులు రావొచ్చు. కాబట్టి స్థానికంగా రేట్లు తెలుసుకోవడం మంచిది.
ఇవీ చదవండి:
షామీ ఇండియా నుంచి కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్
విదేశీ మార్కెట్లపై మహీంద్రా ఫోకస్
మరిన్ని వ్యాపార, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి