Google India: గూగుల్ కొత్త క్యాంపస్ అనంత ప్రారంభం.. ప్రపంచంలోనే..
ABN , Publish Date - Feb 19 , 2025 | 07:45 PM
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ బుధవారం బెంగళూరులో తన కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద కార్యాలయాలలో ఒకటి కావడం విశేషం.

టెక్ దిగ్గజం గూగుల్(Google India), భారతదేశంలో తన అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాంపస్ ‘అనంత(Ananta)’ని ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యంత పెద్ద కార్యాలయాలలో ఒకటి కావడం విశేషం. ఈ కొత్త కార్యాలయం బెంగళూరులో ప్రారంభమైన నేపథ్యంలో దేశంలో టెక్నాలజీ, స్టార్టప్, ఆవిష్కరణల రంగంలో గూగుల్ మరింత విస్తరించనుంది. గూగుల్ తన బ్లాగ్ పోస్ట్ ద్వారా ఈ క్యాంపస్ ప్రారంభంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేసింది. ఈరోజు గూగుల్ ప్రపంచంలో అత్యంత పెద్ద కార్యాలయాల్లో ఒకటైన ‘అనంత’ ప్రారంభించిందని, భారతదేశం పట్ల మా నిరంతర నిబద్ధతను మేము పంచుకుంటున్నామని సంస్థ వెల్లడించింది.
అమరిమిత అవకాశాలు..
"అనంతం" అంటే "అపరిమితం" అని అర్థం. ఇది గూగుల్ టెక్నాలజీ ద్వారా ప్రపంచమంతటా అపరిమిత అవకాశాలను సూచిస్తుంది. గూగుల్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరు నగరంలో ఈ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించింది. ఇది గూగుల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రౌండ్ అప్ డెవలప్‌మెంట్‌లో ఒక భాగమని చెబుతున్నారు. ‘అనంత’ క్యాంపస్ వర్క్‌ప్లేస్ డిజైన్‌లో గూగుల్ ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. ఈ క్యాంపస్‌లో ప్రతి వర్కింగ్ ఫ్లోర్ సిటీ గ్రిడ్ లాంటి విధానంలో రూపొందించారు. దాని సమీపంలో వీధుల నెట్‌వర్క్ కూడా ఉంది. దీంతో నావిగేషన్ సులభంగా ఉంటుంది. ఈ విధానం వల్ల కార్యాలయంలో వ్యక్తులు ఒకరికొకరు సహకరించుకోవడంతో కీలక పాత్ర పోషిస్తుంది.
వినియోగదారులకు..
ఈ క్యాంపస్ ప్రతి ఫోర్లో వ్యక్తులు స్వేచ్ఛగా కొంత సమయం గడపగలిగే ప్రదేశాలు కూడా ఉన్నాయి. గూగుల్ ఈ క్యాంపస్‌ను ఈ విధంగా రూపొందించడం ద్వారా ఉద్యోగుల మధ్య సహకారం, సృజనాత్మకత, ఆవిష్కరణలు, వృత్తి జీవితాల మధ్య అనుబంధాన్ని మరింత పెంచనుంది. ఈ క్యాంపస్ గూగుల్ ఇండియా, స్థానిక అభివృద్ధి, డిజైన్ బృందాల సహకారంతో నిర్మించబడింది. గత రెండు దశాబ్దాలలో గూగుల్ భారతదేశంలో అనేక టెక్నాలజీ ఆవిష్కరణలను చేసింది. ఈ క్రమంలో Google Pay సహా అనేక సేవలను అందిస్తోంది. అయితే గూగుల్ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వినియోగదారులకు మరింత విలువ చేకూర్చడం. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు అత్యుత్తమమైన సాంకేతిక పరిష్కారాలను అందించడమని చెబుతోంది.
సవాళ్లను ఎదుర్కొనేందుకు
ఈ గూగుల్ క్యాంపస్ ఇండియా నుంచి ప్రపంచానికి అనేక సేవలు అందించడంలో కీలకంగా మారనుందని సంస్థ తెలిపింది. గూగుల్ ప్రపంచ స్థాయి ఉత్పత్తులను అందించడానికి, స్థానిక వ్యాపారాలు, స్టార్టప్‌లతో భాగస్వామ్యాన్ని పెంచేందుకు, ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడానికి ఈ కొత్త క్యాంపస్ సహాయపడుతుందని ఆశిస్తోంది. గూగుల్ కొత్త క్యాంపస్ ‘అనంత’ ఈ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆవిష్కృతంగా ఉండనుందని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ఉండే లక్ష్యాలు, ఉద్యోగుల మధ్య సహకారం, మరింత ఆవిష్కరణలు, మంచి పని వాతావరణం ఏర్పడటానికి దోహదం చేస్తుందని అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా వ్యాపారం ఈసారి 3 లక్షల కోట్లు.. సరికొత్త రికార్డ్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
New FASTag Rules: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్.. ఇవి పాటించకుంటే ఫైన్..
Read More Business News and Latest Telugu News