Share News

Narendra Modi: చెడు ఉద్దేశంతో అలా చేయను.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:46 PM

చెడు ఉద్దేశాలతో ఎప్పుడూ తప్పు చేయకూడదనేదే తన జీవిత మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌తో పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన క్రమంలో పీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Narendra Modi: చెడు ఉద్దేశంతో అలా చేయను.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
pm Modi Nithin Kamath

ప్రధాని నరేంద్ర మోదీ (PrimeMinisterModi) ఇటీవల తన మొదటి పాడ్‌కాస్ట్‌ను ప్రారంభించారు. తన యూట్యూబ్ ఛానెల్ "పీపుల్ బై WTF"లో జెరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్‌తో (NithinKamathPodcast) మోదీ ఈ ఆసక్తికరమైన సంభాషణను జరిపారు. రెండు గంటలపాటు సాగిన ఈ పాడ్‌కాస్ట్‌లో మోదీ తన జీవితంలోని అనేక ముఖ్యమైన అంశాలను పంచుకున్నారు. ఇందులో తన బాల్యం, రాజకీయ ప్రయాణం, ఒత్తిడి ఎదుర్కొవడం, వైఫల్యాలను ఎదుర్కొవడం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలను ప్రస్తావించారు.


కుటుంబం గురించి..

పాడ్‌కాస్ట్ ప్రారంభంలో నితిన్ కామత్ తన అనుభూతిని వ్యక్తం చేస్తూ, "నేను మీ ముందు కూర్చుని మాట్లాడుతున్నాను. నేను కొంచెం ఉద్వేగంతో ఉన్నాను. ఇది నాకు చాలా కష్టమైన సంభాషణ అని చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ చిరునవ్వుతో "ఇది నా మొదటి పాడ్‌కాస్ట్, ఇది ప్రేక్షకులకు ఎలా వెళుతుందో నాకు తెలియదని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ తన చిన్ననాటి విశేషాలను పంచుకున్నారు. తన కుటుంబం గురించి మోదీ మాట్లాడారు.


వాళ్లకు మాత్రం...

''నేను మా కుటుంబంలో అనేక పరిస్థితులను చుశాను. నా చిన్నతనంలో నేను గడిపిన జీవితం నాకు చాలా నేర్పింది. ఒక విధంగా ఇది నాకు అతిపెద్ద విశ్వవిద్యాలయం. ఎందుకంటే నా తల్లులు, సోదరీమణుల నుంచి అనేక విషయాలను నేర్చుకున్నాను. నీటి కోసం చెరువుకు రెండు మూడు కిలోమీటర్లు నడవడం చూసిన స్థితి నుంచి వచ్చాను. ఈ క్రమలోనే నేను ప్రజల కలలను నిజం చేసేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను.'' ముఖ్యమంత్రి అయిన తరువాత తన పాత స్నేహితులని, ఉపాధ్యాయులను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తనను వారు సీఎం అని పిలిచే అవకాశం వచ్చింది. కానీ ఆ రోజు తనకు సంతోషం కలగలేదన్నారు. ఎందుకంటే వాళ్లు తనని సీఎంగా చుశారు కానీ, వాళ్లకు నేను స్నేహితుడిగా కనిపించలేకపోయానని చెప్పారు.


తొలిసారి ఎమ్మెల్యే

2002లో తాను మొదటిసారి ఎమ్మెల్యే అయిన రోజును కూడా ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. 2002 ఫిబ్రవరి 24న ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మూడు రోజులకే గోద్రా రైలు దహనం ఘటన జరిగిందన్నారు. ఆ క్రమంలో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధికారులు హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కానీ నాకు దొరికిన హెలికాప్టర్ వీఐపీలకు కాదు. నాకు సాధారణ మనిషిగా వెళ్లాల్సిన అవసరం ఉందని అనుకున్నానని చెప్పారు. ఆ తరువాత ఒక సింగిల్ ఇంజన్ హెలికాప్టర్‌లో ఆయన గోద్రా చేరుకున్నారు.


ప్రధాని తన జీవితంలోని 3 ప్రధాన విషయాలను పంచుకున్నారు

  • "నా ప్రయత్నాలలో నేను ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టను''

  • "నా కోసం నేను ఏమీ చేసుకోను''

  • "నేను మనిషిని, నేను తప్పులు చేయవచ్చు, కానీ చెడు ఉద్దేశంతో అలా చేయను."

తన తప్పులను స్వీకరించడం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ "తప్పులు చేయడం సహజం, ఎందుకంటే నేను మనిషిని, దేవుడు కాదు. కానీ నేను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయనని స్పష్టం చేశారు. ఇది తన మానవత్వాన్ని, నిజాయితీని ప్రతిబింబిస్తుందని చెప్పవచ్చు.


చైనా అధ్యక్షుడితో..

ప్రధాని మోదీ 2014లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో జరిపిన ఆసక్తికరమైన సంభాషణను కూడా ప్రస్తావించారు. ఆయన చైనా అధ్యక్షుడిగా ప్రమాణం తీసిన వెంటనే జీ జిన్‌పింగ్ భారత్‌ పర్యటనకు రావాలని కోరారు. "నేను గుజరాత్‌కి, మీ స్వగ్రామమైన వాద్‌నగర్‌కు రావాలనుకుంటున్నాను," అని ఆయన చెప్పారు. దీనికి కారణం చైనా తత్వవేత్త హ్యూయెన్ త్సాంగ్ వాద్‌నగర్‌లో చాలా కాలం ఉన్నారని జిన్‌పింగ్ అన్నారు. ఈ సంభాషణలో ప్రధాని మోదీ తన వ్యక్తిగత జీవితం, రాజకీయ అనుభవాలు, విశ్వాసాలు, లక్ష్యాలను పంచుకున్నారు. పూర్తిగా నమ్మకం, నిజాయితీ దృష్టితోనే నా ప్రయాణం కొనసాగుతోందని మోదీ ఈ చర్చను ముగించారు.


ఇవి కూడా చదవండి:

Stock Market: వారాంతంలో కూడా భారీ నష్టాలు.. ఆల్‌టైం కనిష్టానికి రూపాయి..

Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...


Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ


Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 10 , 2025 | 04:52 PM