SIM Card New Rules: సిమ్ కార్డ్ కొత్త రూల్స్ గురించి తెలుసా.. ఇది తప్పనిసరి
ABN , Publish Date - Jan 15 , 2025 | 02:27 PM
మీరు కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ కొత్త నిబంధనల గురించి మీకు తెలుసా లేదా. లేదంటే ఇప్పుడే తెలుసుకోండి మరి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇకపై విచ్చలవిడిగా సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి లేదు. అంతేకాదు ఒకరి ఐడీ ప్రూఫ్‌తో మరొకరు సిమ్ కార్డు (SIM Card New Rules) తీసుకున్నా కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే సిమ్ కార్డులు అమ్మే విషయంలో PMO కొత్త ఆర్డర్ జారీ చేసింది. ఈ క్రమంలో ఆధార్ కార్డు బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండా సిమ్ కార్డుల అమ్మకం చేయకూడదని పీఎంఓ డీఓటీకి ఆదేశాలిచ్చింది. దీంతో ఇకపై కొత్త సిమ్ కార్డు కనెక్షన్లకు ఆధార్ బయోమెట్రిక్ ధృవీకరణ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో నకిలీ పత్రాల ద్వారా కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేసి మోసాలకు పాల్పడే వారిని ప్రభుత్వం కట్టడి చేయనుంది.
సిమ్ కార్డ్ కొత్త నిబంధనలు..
సిమ్ కార్డ్ నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు కాకుండా, ఓటరు ఐడి, పాస్‌పోర్ట్ మొదలైన వాటితో సహా ఏదైనా ఇతర ప్రభుత్వ ఐడిని ఉపయోగించి కొత్త మొబైల్ కనెక్షన్ పొందవచ్చు. సిమ్ కార్డుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం ఈ ఉత్తర్వు జారీ చేసింది. ఈ క్రమంలో బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండా సిమ్ కార్డ్ రిటైలర్లు కూడా సిమ్ కార్డులను విక్రయించలేరు.
ఈ ఏజెన్సీలతో కలిసి..
టెలికాం రంగంపై ఇటీవల జరిగిన సమీక్షా సమావేశం తర్వాత PMO ఈ దిశానిర్దేశం చేసింది. AI ఆధారిత సాధనాలను ఉపయోగించడం ద్వారా నేరస్థులను గుర్తించి శిక్షించడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలతో (LEA) కలిసి పనిచేస్తోంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణ లేకుండా సిమ్ కార్డు జారీ చేయబడదని టెలికమ్యూనికేషన్ శాఖ తెలిపింది. ఇలా చేయడం వల్ల మొబైల్ ఫోన్లను మోసానికి ఉపయోగించినా కూడా తెలిసిపోతుంది.
ఒకే ఐడీ ప్రూఫ్ ద్వారా
సైబర్ నేరాలపై ఇటీవల జరిగిన సమావేశంలో టెలికాం రంగ నియమాలను ఉల్లంఘిస్తూ పలువురు ఒకే ప్రూఫ్ ద్వారా అనేక సిమ్ కార్డులు తీసుకుంటున్నట్లు తేలింది. అంతేకాదు అలాంటి సిమ్ కార్డులను ఆర్థిక మోసాలకు ఉపయోగిస్తున్నారని తెలిసింది. మరికొంత మంది ఇతరుల ద్రువీకరణ పత్రాలను ఉపయోగించి కూడా సిప్ కార్డులు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో నకిలీ పత్రాలను ఉపయోగించి సిమ్ కార్డులు జారీ చేసే విక్రేతలను గుర్తించాలని టెలికమ్యూనికేషన్ శాఖకు పీఎంఓ తన ఆదేశాలలో కోరింది. ఇప్పుడు కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ప్రకారం ఇతరుల ద్రువీకరణ పత్రాలతో సిమ్ కార్డులు తీసుకునేందుకు అనుమతి ఉండదు.
ఇవి కూడా చదవండి:
Budget 2025: రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే నెల ఖాతాల్లోకి రూ.10 వేలు
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Tata Tiago: రూ. 7 లక్షలకే.. టాటా ఎలక్ట్రిక్ కార్...
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News