Share News

RBI Restrictions: నిధుల ఉపసంహరణపై ఆర్‌బీఐ ఆంక్షలు.. ఇబ్బంది పడుతున్న కస్టమర్లు

ABN , Publish Date - Feb 15 , 2025 | 07:47 AM

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అకస్మాత్తుగా ఓ బ్యాంకు నిధుల ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. దీంతో ఈ బ్యాంక్ కస్టమర్లు భయాందోళన చెందుతున్నారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

RBI Restrictions: నిధుల ఉపసంహరణపై ఆర్‌బీఐ ఆంక్షలు.. ఇబ్బంది పడుతున్న కస్టమర్లు
RBI Restrictions on Fund Withdrawals

దేశంలోని బ్యాంకింగ్ రంగంలో కొన్ని సందర్భాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇవి సాధారణ ప్రజలకు ఆందోళన కలిగిస్తాయి. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగింది. ఎందుకంటే ముంబైకి చెందిన న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ కస్టమర్లు కూడా ఇలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఈ బ్యాంకుపై అనేక కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో కస్టమర్లు తమ సొంత డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతి లేదని ప్రకటించారు. అయితే ఈ ఆంక్షలు ఎందుకు విధించారు, ఎంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.


డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం..

RBI రూల్స్ ప్రకారం న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపై కొత్త రుణాలు ఇవ్వడం, పాత రుణాలను పునరుద్ధరించడం, కొత్త డిపాజిట్లను అంగీకరించడం వంటి కార్యకలాపాలను కొనసాగించలేరు. బ్యాంకు ఆర్థిక స్థితి, పర్యవేక్షణ సమస్యలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు తీసుకున్నారు. బ్యాంకు ద్రవ్యత పరిస్థితి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల డిపాజిటర్ల డబ్బు ప్రమాదంలో పడినట్లు RBI తెలిపింది.

ఈ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన కస్టమర్లు, డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకం కింద గరిష్టంగా రూ. 5 లక్షల వరకు మాత్రమే క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే ఈ క్లెయిమ్‌లను బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. మార్చి 2024 చివరి నాటికి బ్యాంకులో మొత్తం డిపాజిట్లు రూ. 2,436 కోట్లుగా ఉన్నాయని RBI వెల్లడించింది.


ఆంక్షల కారణాలు

బ్యాంకు ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. బ్యాంకు ద్రవ్యత పరిస్థితి సంతృప్తికరంగా లేకపోవడం వల్ల డిపాజిటర్ల డబ్బు ప్రమాదంలో పడింది. అందుకే RBI ప్రజల ప్రయోజనాలను కాపాడటానికి ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ విధంగా బ్యాంకు పరిస్థితిని నియంత్రించవచ్చని, కస్టమర్లను పెద్ద నష్టాల నుంచి కాపాడవచ్చని RBI వెల్లడించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 13, 2025 నుంచి ఈ బ్యాంకు కొత్త రుణాలు జారీ చేయలేకపోతుందని, పాత రుణాలను పునరుద్ధరించలేదని RBI స్పష్టం చేసింది. దీంతో బ్యాంకు కొత్త పెట్టుబడులు పెట్టడం, కొత్త డిపాజిట్లను అంగీకరించడం వంటి కార్యకలాపాలకు అనుమతి లేదు. బ్యాంకు చెల్లింపులు చేయలేకపోవడం, ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడం వంటి చర్యలు కూడా నిషేధించబడ్డాయి.


కస్టమర్లకు సూచనలు..

దీంతో ఈ బ్యాంక్ కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో మొదటగా ఈ బ్యాంక్ కస్టమర్లు తమ డిపాజిట్లను రక్షించుకోవడానికి RBI ద్వారా అందించిన డిపాజిట్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల వరకు క్లెయిమ్ చేసుకోవడం ద్వారా వారు తమ డబ్బును కొంతమేర రక్షించుకోవచ్చు. కస్టమర్లు తమ బ్యాంకు ఖాతాలను సమీక్షించి, అవసరమైతే ఇతర బ్యాంకులకు మారడానికి సిద్ధంగా ఉండాలన్నారు. కస్టమర్లు బ్యాంకు నిర్వహణతో సంబంధం కలిగి ఉన్న సమస్యలను గుర్తించి, అవసరమైతే న్యాయ సలహా తీసుకోవాలి.


ఇవి కూడా చదవండి:

PM Modi: విదేశీ పర్యటన తర్వాత.. ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోదీ


OpenAI: ఇండియాలో చాట్ జీపీటీ డేటా సెంటర్.. ఎప్పటి నుంచంటే..


BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్

Next Week IPOs: ఈ వారం కీలక ఐపీఓలు.. మరో 6 కంపెనీల లిస్టింగ్


New Delhi: ఇళ్ల ధరల పెరుగుదలలో టాప్ 15 నగరాలు.. ఇండియా నుంచి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 15 , 2025 | 07:50 AM