Share News

Multibagger Stock: రెండేళ్ల క్రితం రూ.300, ఇప్పుడేమో రూ.2300..ఇన్వెస్టర్లకు పైసలే పైసల్..

ABN , Publish Date - Mar 19 , 2025 | 07:18 PM

స్టాక్ మార్కెట్ గురించి అనేక మందికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ మీరు ఈ వార్త గురించి తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఓ కంపెనీ షేర్లలో పెట్టుబడులు చేసి పలువురు రెండేళ్లలోనే కోటీశ్వరులయ్యారు.

Multibagger Stock: రెండేళ్ల క్రితం రూ.300, ఇప్పుడేమో రూ.2300..ఇన్వెస్టర్లకు పైసలే పైసల్..
Multibagger Stock

దేశంలో స్టాక్ మార్కెట్ ద్వారా ప్రతి రోజు కూడా అనేక మంది లాభపడుతుండగా, అదే సమయంలో మరికొంత మంది నష్టపోతున్నారు. కానీ ఇదే సమయంలో కొంత మంది వారు పెట్టుబడులు చేసిన కంపెనీల షేర్ల ధరలు అమాంతం పెరగడంతో వారికి భారీగా లాభాలు వస్తుంటాయి. ఇప్పుడు కూడా అచ్చం అలా కాదు, అంతకు మించి జరిగింది. ఏమైందంటే రెండేళ్ల క్రితం రూ. 300 వద్ద ఉన్న RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లు ఇప్పుడు రూ. 2300 స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఈ కంపెనీలో పెట్టుబడులు చేసిన మదుపర్లకు మంచి లాభాలు వచ్చాయి.


దీనికి ముందు ఈ కంపెనీ స్టాక్ ధర

ఈ కంపెనీ స్టాక్ ధర 2023 మార్చి 31న రూ. 300గా ఉంది. కానీ ఇప్పుడు మార్చి 19, 2025 నాటికి రూ. 2300.60కు చేరుకుంది. అంటే రెండేళ్లలోనే ఈ సంస్థ స్టాక్ ఏకంగా 2000 రూపాయలు పెరిగింది. దీంతో ఈ సమయంలో ఈ కంపెనీలు పెట్టుబడులు చేసి అలాగే ఉంచిన వారు కోటీశ్వరులు అయ్యారని చెప్పవచ్చు. ఎలాగంటే ఈ కంపెనీ స్టాక్ ధర రూ. 300 ఉన్నప్పుడు ఓ 5 వేల షేర్లను కోనుగోలు చేస్తే వాటి విలువ రూ. 15 లక్షలు అవుతుంది. కానీ ఇప్పుడు వాటి విలువ రూ. 1,150,000కు చేరుకుంది. అంటే మీ పెట్టుబడి అనేక రెట్లు పెరగడంతోపాటు మీరు కోటీశ్వరులుగా మారిపోయారు.


700% లాభం

ఈ అద్భుతమైన పెరుగుదల ఇన్వెస్టర్లకు మల్టీ-బ్యాగర్ లాభాలను అందించి, మార్కెట్‌లో దాని ప్రతిష్టను మరింత పెంచుకుంది. గత రెండు సంవత్సరాల్లో RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేర్లు దాదాపు 700% లాభాన్ని అందించాయి. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తే, RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ షేరు ప్రస్తుతం BSEలో రూ. 2300 వద్ద 5% అప్పర్ సర్క్యూట్‌లో ట్రేడవుతోంది. ఈ స్థాయికి చేరడంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,765 కోట్లకు చేరుకుంది.


నేటి ట్రేడింగ్‌లో

దీంతో RIR పవర్ షేర్ మరోసారి ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ స్టాక్ ఇటీవల మూడు వరుస సెషన్లలో 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. అంతేకాకుండా ప్రస్తుతం ఈ స్టాక్ BSEలో రూ. 2,191.05తో ముగిసింది. కానీ నేటి ట్రేడింగ్‌లో రూ. 2,300.60 వద్ద 5% పెరిగింది. RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్‌పై ఇప్పుడు "లాంగ్ టర్మ్ అదనపు నిఘా" (LT-ASM) పడింది. దీని ప్రకారం, డెలివరీ ఆధారిత లావాదేవీలు తప్పనిసరి అవుతున్నాయి. ఈ రూల్ ప్రకారం ఇన్వెస్టర్లకు ఇంట్రాడే లివరేజ్ అనుమతించబడదు. వారు లావాదేవీ విలువలో 100% మార్జిన్ ముందుగా అందించాల్సి ఉంటుంది.


ఇవి కూడా చదవండి:

Credit Card: ఓర్నీ..క్రెడిట్ కార్డ్ వద్దని బ్లాక్ చేసినా సిబిల్ స్కోర్ తగ్గుతుందా..

Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..

Credit Score: మీ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా..సిబిల్ స్కోర్ తగ్గుతుందా, ఇలా చేయండి

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 19 , 2025 | 07:19 PM