Share News

N Chandrasekaran: టాటా గ్రూప్ చైర్మన్‌కు అరుదైన గౌరవం.. నైట్‌హుడ్‌ పురస్కారం ప్రకటించిన బ్రిటన్..

ABN , Publish Date - Feb 14 , 2025 | 06:57 PM

టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌కు అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది. బ్రిటన్‌, భారత్‌ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది.

N Chandrasekaran: టాటా గ్రూప్ చైర్మన్‌కు అరుదైన గౌరవం..  నైట్‌హుడ్‌ పురస్కారం ప్రకటించిన బ్రిటన్..
N Chandrasekaran

టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖర్‌కు (N Chandrasekaran) అరుదైన గౌరవం దక్కింది. బ్రిటీష్‌ ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక నైట్‌హుడ్ పురస్కారాన్ని ప్రకటించింది (UK Honorary Knighthood). బ్రిటన్‌, భారత్‌ మధ్య వ్యాపార సంబంధాల కోసం ఆయన చేసిన కృషిని గుర్తించాలని బ్రిటీష్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆయనకు ``మోస్ట్‌ ఎక్సలెంట్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌`` (The Most Excellent Order of the British Empire) అవార్డును ప్రదానం చేయనుంది. ఈ మేరకు బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నట్టు చంద్రశేఖర్ పేర్కొన్నారు (TATA Group).


``ఈ ప్రతిష్టాత్మక పురస్కారం లభించడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. గౌరవనీయ కింగ్ చార్లెస్‌కు కృతజ్ఞతలు. టెక్నాలజీ, హాస్పిటాలిటీ, ఉక్కు, రసాయనాలు, ఆటోమోటివ్ రంగాల్లో యూకేతో పటిష్టమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించడం టాటా గ్రూప్‌నకు గర్వకారణం. జాగ్వార్ ల్యాండ్ రోవర్, టెట్లీ లాంటి మా ఐకానిక్ బ్రిటీష్ బ్రాండ్లు మాకెంతో గర్వకారణమైనవి. యూకేలోని మా సంస్థల్లో 70, 000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నార``ని చంద్రశేఖరన్ ట్వీట్ చేశారు.


లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, వార్విక్ విశ్వవిద్యాలయం, స్వాన్సీ విశ్వవిద్యాలయంతో సహా బ్రిటన్‌లో ఉన్న గొప్ప సంస్థలతో తాము విద్యా భాగస్వామ్యాలను ఆస్వాదిస్తున్నామన్నారు. తనకు గౌరవనీయ అవార్డు ప్రకటించినందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. చంద్రశేఖరన్ అక్టోబర్2017, జనవరిలో టాటా గ్రూప్ చైర్మన్‌గా నియమితులయ్యారు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 14 , 2025 | 06:57 PM