Share News

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే...

ABN , Publish Date - Mar 20 , 2025 | 05:10 PM

Nirmala Sitarman: మరికొద్ది రోజుల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న పలు అంశాలు ఈ కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి అమలు కానున్నాయి.

Nirmala Sitharaman: ఏప్రిల్ 1 నుంచి  రానున్న మార్పులివే...
Finance Minister Nirmala Sitaraman

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి వారికి ఆదాయపు పన్నులో భారీ ఉపశమనంతో పాటు అనేక నియమాలలో కీలక మార్పులు చేశారు. ఇవి ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి.. అంటే 2025, ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మార్పులో పన్ను మినహాయింపు (TDS)తోపాటు మూలం పన్ను వసూలు (TCS) కోసం కొత్త నియమాలు సైతం ఉన్నాయి.

వృద్ధులు,ఇంటి యజమానులకు పెద్ద ఉపశమనం

సీనియర్ సిటిజన్లకు టీడీఎస్ తగ్గింపును రెట్టింపు చేసింది. గతంలో ఇది రూ. 50 వేలుగా ఉండేది. ప్రస్తుతం అది రూ. లక్షకు చేరింది. ప్రస్తుతం ఇది గొప్ప ఉపశమనంగా మారింది. అదే సమయంలో..ఇంటి యజమానులకు సైతం పెద్ద ఉపశమనం లభించింది. అదేమంటే..అద్దె ఆదాయంపై TDS మినహాయింపు పరిమితిని ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంచారు.


విదేశీ లావాదేవీలపై టీసీఎస్ పరిమితి పెంపు

విదేశాల నుంచి లావాదేవీలు చేసే వారికి RBI సరళీకృత రెమిటెన్స్ పథకానికి TCS తగ్గింపు పరిమితిని కూడా పెంచారు. గతంలో విదేశాల నుంచి జరిగే లావాదేవీలపై టీసీఎస్‌ను రూ.7 లక్షలకు తగ్గించే వారు, అయితే ప్రస్తుతం దానిని రూ.10 లక్షలకు పెంచారు.

విద్యా రుణంపై TDS తొలగించబడింది

నిర్దిష్ట ఆర్థిక సంస్థల నుంచి విద్యా రుణంపై TCS మినహాయింపు తొలగించారు. గతంలో రూ.7లక్షల కంటే ఎక్కువ విద్యా రుణాలపై 0.5% TCS తగ్గించబడేది, అయితే రూ.7 లక్షల కంటే ఎక్కువ విద్యా లావాదేవీలపై 5% TCS తగ్గించబడింది.


డివిడెండ్, మ్యూచువల్ ఫండ్ ఆదాయాలపై పరిమితి

డివిడెండ్ ఆదాయంపై టీడీఎస్ పరిమితిని రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు, మ్యూచువల్ ఫండ్ యూనిట్ల నుంచి వచ్చే ఆదాయంపై టీడీఎస్ పరిమితిని కూడా ఆర్థిక సంవత్సరానికి రూ.5,000 నుంచి రూ.10,000కి పెంచారు. ఇది కాకుండా..బహుమతికి TDSను రూ.10,000కు పెంచారు.

గ్యాస్ ధర

చమురు కంపెనీలు ప్రతి నెల మొదటి తేదీన LPG ధరలను సమీక్షిస్తాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 1వ తేదీ తెల్లవారుజామున సిలిండర్ ధరలలో మార్పులు సంభవించే అవకాశముంది.


ATF మరియు CNG-PNG రేట్లు

ప్రతి నెలా మొదటి తేదీన, చమురు కంపెనీలు విమాన ఇంధనం ధరలలో అంటే ఎయిర్ టర్బైన్ ఇంధనం (ATF), CNG-PNG ధరలలో సైతం కొన్ని మార్పులు తీసుకు రానున్నాయి.

Also Read:

Pawan Kalyan : ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే.. వారే కారణం

CM Nitish Kumar: అసెంబ్లీలో ఏమిటిది అధ్యక్ష్యా..

For Business News And Telugu News

Updated Date - Mar 20 , 2025 | 05:34 PM

News Hub