Share News

Mutual Funds: SIP మధ్యలోనే రద్దు చేస్తున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాలి..

ABN , Publish Date - Mar 19 , 2025 | 04:15 PM

Mutual Funds: గత కొంతకాలంగా మార్కెట్లు నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. దీంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్‌మెంట్లను వెనక్కి తీసుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ల పరిస్థితి నానాటికీ దిగజారుతుండంతో ఎక్కడ నష్టపోతామో అనే భయంతో సిప్ కట్టేవాళ్లు పెద్ద మొత్తంలో తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

Mutual Funds: SIP మధ్యలోనే రద్దు చేస్తున్నారా.. అయితే ఇది కచ్చితంగా తెలుసుకోవాలి..
SIP Investments

SIP Mutual Funds: ఒక్క భారతదేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి. ఇందుకు అనేక రకాల కారణాలు.అనిశ్చిత మార్కెట్ పరిస్థితులతో ఆందోళన చెందుతున్న భారతీయ పెట్టుబడిదారుల్లో అధిక శాతం సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తున్నారు. ముఖ్యంగా నెలా నెలా పే చేసే SIPలను రద్దు చేస్తూ తమ పెట్టుబడిని ఉపసంహరించుకుంటున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇది ఎంతలా అంటే, 2025 జనవరి నెలలో ఒక్కటే SIP నిలిపేసినవారి రేటు 109% గా ఉంది. ఇలా మధ్యలో సిప్ రద్దు చేయడం మంచిదేనా.. దీనిపై నిపుణులు ఏం సలహా ఇస్తున్నారు.


కొన్నాళ్లుగా స్టాక్ మార్కెట్ల సూచీలు నేలనే చూస్తున్నాయి. రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో స్వల్ప మార్పులే కనిపిస్తున్నాయి. ఈ ధోరణికి భయభ్రాంతులకు గురవుతున్నారు పెట్టుబడిదారులు. మార్కెట్లు కోలుకోవనే నిర్ణయానికి వచ్చి ఎక్కువ శాతం SIPలను రద్దు చేయడం ప్రారంభించారు. 2025 జనవరిలో ఒక్కటే 5.14 లక్షల మంది SIP నిలిపివేశారు. ఇలా పాత SIPల సంఖ్యతో పాటు కొత్తగా SIP నమోదు చేసుకునేవారి సంఖ్య కూడా భారీగా తగ్గుతూ వస్తోందని మ్యూచువల్ ఫండ్‌ల అసోసియేషన్ ఆఫ్ ఇండియా (AMFI) డేటా వెల్లడించింది. ఇలాంటి స్థితిలో SIP కొనసాగించాలా.. రద్దు చేయాలా.. నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.


SIP కొనసాగించాలా.. ఆపివేయాలా..

వృద్ధి రేటు తగ్గుదల, విదేశీ పెట్టుబడులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు తదితర కారణాల వల్ల ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో దీర్ఘకాలిక రాబడులను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన SIPలను మధ్యలోనే ఆపివేయడం మనకు లాభించకపోగా, మార్కెట్ల పరిస్థితిని మరింత దిగజారుస్తుందని నిపుణులు అంటున్నారు. ఒకే ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోవాలని సూచిస్తున్నారు. మార్కెట్లు కింద పడిన ప్రతిసారీ తిరిగి కోలుకోవడం తథ్యం. అంటే ఇవాళ మీరు నష్టపోయారని పెట్టుబడులు వెనక్కి తీసుకుంటే భవిష్యత్తులో SIPల ద్వారా భారీ లాభాలు పొందే అవకాశాన్ని మీరు కోల్పోతారు. ఇలాంటి స్థితిలో మరింతగా ఇన్వెస్ట్ చేస్తే ఊహించని రాబడులు పొందవచ్చు.


మార్కెట్ల స్థితి ఘోరంగా ఉన్న పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో పెద్ద కంపెనీల వాటాలను పెంచుకుంటే తప్పకుండా ఆర్థిక వృద్ధి సాధిస్తారు. ఇలాంటి సమయాల్లోనే ఎప్పుడూ నిలకడగా లాభాలు పొందే పేరొందిన కంపెనీల్లో మీ వాటా పెంచుకునేందుకు ప్రయత్నించండి. నాణ్యతగల స్టాక్‌లను ఎంపిక చేసుకుంటే మంచిది. అయితే ఈ ఒక్క విషయం తప్పక గుర్తుంచుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అమెరికా బాండ్ల వడ్డీ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. వాణిజ్య యుద్ధాలు, రూపాయి విలువ క్షీణతలు మార్కెట్లపై ఒత్తిడిని పెంచి పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.


Read Also : Fake Calls: ఫేక్ కాల్స్ కట్టడి కోసం..వాట్సాప్, టెలికమ్యూనికేషన్స్ విభాగం కీలక నిర్ణయం..

Gold Rates today: కస్టమర్లకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర

ఈ నెలాఖరు నాటికి ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ

Updated Date - Mar 19 , 2025 | 04:24 PM