Budget 2025: బడ్జెట్ 2025లో ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు కాబోతుందా..
ABN , Publish Date - Jan 08 , 2025 | 05:19 PM
దేశంలో లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈసారైనా బడ్జెట్ 2025లో 8వ వేతన సంఘం ఏర్పాటు ప్రకటిస్తారా, లేదా ఇంకా ఆలస్యం చేస్తారా అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర బడ్జెట్ 2025 (Budget 2025) సమీపిస్తున్న తరుణంలో 8వ వేతన సంఘం ఏర్పాటు (8th Pay Commission) గురించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మళ్లీ అంచనాలు పెరిగాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ డిమాండ్‌ను వింటారని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. ప్రతి సంవత్సరం బడ్జెట్‌కు ముందు, ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వివిధ రంగాలు, సమూహాల నుంచి డిమాండ్లు, సూచనలను తీసుకుంటుంది. ఈ గ్రూపులు ప్రైవేట్, ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి.
వేచి చూస్తున్న లక్షల మంది
ఈ నేపథ్యంలోనే ఇటీవల కార్మిక సంఘాల ప్రతినిధులు ఆర్థిక మంత్రి సీతారామన్‌ను కలిశారు. 50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 67 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపే ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ప్రీ-బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో కొత్త పే కమిషన్ అంశాన్ని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (CITU) జాతీయ కార్యదర్శి స్వదేశ్ దేవ్ రాయ్ లేవనెత్తారు. ప్రస్తుతం ఏడో వేతన సంఘం ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నందున వెంటనే వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు.
కార్మిక సంఘాల డిమాండ్లు ఏంటి..
సమావేశం అనంతరం టీయూసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్పీ తివారీ కీలక అంశాల గురించి మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థల (PSU) ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చర్యలన్నింటినీ ప్రభుత్వం ఆపాలని కార్మిక సంఘాలు కోరుతున్నట్లు తెలిపారు. అనధికారిక కార్మికులకు సామాజిక రక్షణకు ఆర్థిక సహాయం చేయడానికి అతి సంపన్నులపై అదనంగా 2% పన్నును పెంచాలని కోరారు. వ్యవసాయ కార్మికులకు సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించాలని, వారికి కనీస వేతనాలు నిర్ణయించాల్సిన అవసరాన్ని కూడా తివారీ నొక్కి చెప్పారు.
పన్ను మినహాయింపు పరిమితి పెంచాలి..
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించాలని ఆయన సిఫార్సు చేశారు. ఎనిమిదో వేతన సంఘంతో పాటు ఆర్థిక మంత్రితో జరిగిన సమావేశంలో కార్మిక సంఘాలు కనీస EPFO పెన్షన్‌ను నెలకు 5,000 రూపాయలకు పెంచాలన్నారు. అదనంగా ప్రభుత్వ ఉద్యోగుల వేతన వ్యవస్థను సవరించడానికి 8వ వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను కేంద్ర మంత్రి ఫిబ్రవరి 1, 2025న సమర్పించనున్నారు.
చాలా కాలంగా డిమాండ్..
ఏడవ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 2025లో ముగుస్తుంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫిబ్రవరి 2014లో ఏడవ వేతన సంఘం ఏర్పడింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 2016లో దీని సిఫార్సులు అమలు చేయబడ్డాయి. ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని చాలా కాలంగా వివిధ కార్మిక సంఘాలు, ఉద్యోగుల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నాయి. గత నెలలో జాయింట్ జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ (NC-JCM) నేషనల్ కౌన్సిల్ (స్టాఫ్ సైడ్) కొత్త పే కమిషన్‌ను 'త్వరితగతిన' ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాసింది.
ఇప్పటికే లేఖ కూడా..
డిసెంబరు 3న రాసిన లేఖలో ఏడో వేతన సంఘం సిఫార్సులు అమలు చేసి 9 ఏళ్లు దాటిందని ఉద్యోగుల పక్షం ఉద్ఘాటించింది. తదుపరి జీతం, పెన్షన్ సవరణ జనవరి 1, 2026 నుంచి గడువు ఉందని తెలిపింది. NC JCM కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా తన లేఖలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను సవరించడం కోసం 1986లో నాల్గవ వేతన సంఘం నుంచి 10-సంవత్సరాల చారిత్రక పూర్వస్థితి గురించి ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
SNACC: 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ.. మార్కెట్లోకి కొత్త యాప్..
Investment Tips: ఒకేసారి ఈ పెట్టుబడి చేసి మర్చిపోండి.. 15 ఏళ్లకే మీకు కోటీ
Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..
Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..
Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..
Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..
Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Read More Business News and Latest Telugu News