Share News

Anantapur: గంజాయి మత్తులో యువత.. స్పృహలేని స్థితిలో దారుణాలు

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:09 PM

పట్టణంలోగంజాయి విక్రయాలు, వినియోగం జోరుగా సాగుతోంది. మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఈ గొడవలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొన్ని రోజుల కిందట నందలపాడు, టైలర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌(Bhagatsinghnagar), కూరగాయల మార్కెట్‌, నంద్యాలరోడ్డు, పాతకోట, సుంకులమ్మపాలెం, విజయనగర్‌కాలనీ, అంబేడ్కర్‌నగర్‌, ఏటిగడ్డపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌పై పోలీసులు దాడులు చేశారు.

Anantapur: గంజాయి మత్తులో యువత.. స్పృహలేని స్థితిలో దారుణాలు

- పట్టించుకోని పోలీసులు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

తాడిపత్రి(అనంతపురం): పట్టణంలోగంజాయి విక్రయాలు, వినియోగం జోరుగా సాగుతోంది. మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఈ గొడవలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొన్ని రోజుల కిందట నందలపాడు, టైలర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌(Bhagatsinghnagar), కూరగాయల మార్కెట్‌, నంద్యాలరోడ్డు, పాతకోట, సుంకులమ్మపాలెం, విజయనగర్‌కాలనీ, అంబేడ్కర్‌నగర్‌, ఏటిగడ్డపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌పై పోలీసులు దాడులు చేశారు. కొందరిని మాత్రమే అరెస్ట్‌ చూపించి చేతులు దులుపుకున్నారు. యల్లనూరు రోడ్డులో గంజాయి బ్యాచ్‌ పట్టపగలే రాళ్లతో దాడులు చేసుకున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Former minister: విద్వేషాలకు ప్రభుత్వ వైఖరే కారణం


నంద్యాల రోడ్డు(Nandyal Road)లోని విశాల్‌మార్ట్‌ సమీపంలో కూడా దాడులు జరిగాయి. నెల కిందట కృష్ణాపురం జీరో రోడ్డులో కాలేజీ విద్యార్థినిని కామెంట్‌ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న బేల్దార్లు శంకర్‌, సుబ్బరాయుడు, నాగేంద్ర మందలించారు. వారిపైనా గంజాయి బ్యాచ్‌ రాళ్లతో దాడి చేసింది. కృష్ణాపురం ఆరోరోడ్డులో గంజాయి బ్యాచ్‌ 40 రోజుల కిందట హల్‌చల్‌ చేయడంతో ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడి ఇంటిపైకి వెళ్లి దాడి చేశారు.


ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసులు నామమాత్రంగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భగత్‌సింగ్‌నగర్‌లో నూతన ఇంటి నిర్మాణంలో గంజాయి బ్యాచ్‌ ఉన్న వీడియో వైరల్‌ అయింది. కానీ వారిని ఇంతవరకు అరెస్ట్‌ చేసిన పాపానపోలేదు. వీరికి అనంతపురం, గుంతకల్లు, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా రైలుమార్గంద్వారా గంజాయి సరఫరా అవుతోందని సమాచారం.


బయటికెళ్లాలంటే భయం

గంజాయి బ్యాచ్‌ల ఆగడాలు మితిమీరడంతో విద్యార్థినులు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. విద్యార్థినులను కళాశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులున జంకుతున్నారు. యల్లనూరు, కృష్ణాపురం జీరో రోడ్డు, పుట్లూరు రోడ్డు ప్రాంతాల్లో కాలేజీలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌ల సంచారం ఎక్కువైంది. కుటుంబ సభ్యులు వెంట వెళ్లి పిల్లలను కాలేజీల్లో వదలాల్సి వస్తోంది. ఇప్పటికే పలువురు కళాశాల నిర్వాహకులు పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. సిబ్బంది కొరతతో పోలీసులు పట్టించుకోవడం లేదు.


ముఖ్యంగా యల్లనూరురోడ్డు, కృష్ణాపురం జీరోరోడ్డు, పుట్లూరురోడ్డు ప్రాంతాల్లో కళాశాలలు ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతాల్లో గంజాయి తీసుకునే యువకులు నిత్యం సంచరిస్తు, వి ద్యార్థినులను ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గంజాయితోపాటు తెల్లగా పౌ డర్‌ రూపంలో ఉన్న పదార్థాన్ని పీలుస్తూ కొంతమంది యువకులు మత్తు లో మునిగితేలుతున్నారు. దీంతో భయం, ఏమి చేస్తున్నామో అనే స్పృహ లేకుండా దాడులకు తెగబడుతున్నారు.


రోడ్లపై ప్రమాదకరమైన బైక్‌ స్టంట్‌లు

పట్టణంలోని కొన్ని వీధుల్లో రాత్రిపూట గంజాయి బ్యాచ్‌ ద్విచక్రవాహనాలతో హల్‌చల్‌ చేస్తోంది. గంజాయి మత్తులో ఉన్న కొంతమంది పట్టణంలోని యల్లనూరు, సీబీరోడ్డు, పుట్లూరురోడ్డు, నంద్యాలరోడ్డు ప్రాంతాల్లో బైక్‌ స్టంట్‌లు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వాహనం కింద పడి ప్రమాదం జరిగితే వారితోపాటు సమీపంలో ఉన్నవారు కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే బైక్‌స్టంట్‌లు నిర్వహించినవారు కిందపడి గాయపడ్డ సంఘటనలు ఉన్నాయి. ఎవరైనా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వచ్చే సమయానికి వెళ్లిపోయి తిరిగి వచ్చి అదేపనిగా స్టంట్స్‌ చేస్తున్నారు. దీనంతటికి గంజాయి వంటి పదార్థాల సేవనమే కారణమని పలువురు పేర్కొంటున్నారు. కాగా బైక్‌స్టంట్‌లు చేసిన వారిపైన పోలీసులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని, అందుకే వారు మత్తులో రెచ్చిపోతున్నారని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.


ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం

తాడిపత్రి, పరిసర ప్రాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు జరిగిన కొన్ని సంఘటనల్లో అతిగా మద్యం సేవించి దాడులు చేశారని మా దృష్టికి వచ్చింది. వారిపైన కేసులు పెట్టి రిమాండ్‌కు తరలించాం. సాయంత్రం వేళల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తాం. సమస్య ఏదై నా మా దృష్టికి రాగానే చర్యలు తీసుకుంటున్నాం.

- రామకృష్ణుడు, డీఎస్పీ


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 01:09 PM