WhatsApp: వాట్సాప్‌లో సట్టా బెట్టింగ్
ABN , Publish Date - Apr 03 , 2025 | 07:37 AM
గత కొద్దిరోజులుగా వాట్సాప్ ద్వారా సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఈ సందర్భంగా వారివద్ద నుంచి లక్ష రూపాయల నగదు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ప్రింటర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఐదుగురి అరెస్ట్
- లక్ష రూపాయలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ప్రింటర్లు స్వాధీనం
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్(Online)లో సట్టా బెట్టింగ్ నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఐదుగురిని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ హసన్‌పర్తికి చెందిన యాలదండి రాజేందర్(Yaladandi Rajender)కు ముంబైలో ఉన్న సట్టా గ్యాంగుతో సంబంధాలున్నాయి. మహారాష్ట్ర కేంద్రంగా నడిచే ఆన్‌లైన్ సట్టా బెట్టింగ్‌లో నగర ఏజెంట్‌గా ఉంటూ కమిషన్ తీసుకుంటున్నాడు. సట్టా నిర్వహించేందుకు చిలకలగూడ(Chilakalaguda)లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సిగరెట్ లేదన్నాడని.. ఎంతపని చేశాడో తెలిస్తే..
బెట్టింగ్ దందా చేసేందుకు సమీప బంధువు వరంగల్‌కు చెందిన పెనుగొండ సాంబశివుడు(32), అల్వాల్ నివాసి మేడిశెట్టి యాదగిరి(40), వరంగల్ కే సముద్రం(Warangal K Samudram) ప్రాంతానికి చెందిన ఎలుగు కార్తీక్(23), మహారాష్ట్రకు చెందిన ఫైజాన్ ఖాన్(25), వరంగల్ పెద్దపల్లెకు చెందిన తాళ్లపల్లి పున్నం చందర్‌గౌడ్(26)ను నియమించుకున్నాడు. వీరందరూ దేశ వ్యాప్తంగా ఉన్న పంటర్ల నుంచి వాట్సాప్ ద్వారా బెట్టింగ్‌లు తీసుకుంటారు. చెల్లింపులను యూపీఐ ద్వారా నిర్వహిస్తున్నారు. మూడేళ్ల నుంచి దందా నిర్వహిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు చిలకలగూడలో ఇంటిపై దాడి చేశారు. ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న సాంబశివుడు, యాదగిరి, కార్తీక్, ఫైజాన్‌ఖాన్, చందర్‌గౌడ్‌ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,07,200, మూడు ల్యాప్‌టాప్‌లు, 11 మొబైల్‌ఫోన్లు, ప్రింటర్లు, బెట్టింగ్ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా సట్టా బెట్టంగ్ జరుగుతోందని, ముఠాలోని కీలక వ్యక్త పరారీలో ఉన్నాడని టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కొత్త తల్లులు గిల్ట్ లేకుండా..
ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..
Read Latest Telangana News and National News