Share News

కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:56 AM

ఓ పక్క ప్రపంచం కంప్యూటర్ యుగంలో దూసుకెళ్తున్నా ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ కుల జాడ్యం పోవడం లేదు. కులాంతర వివాహానికి సిద్ధమైందని.. తన తోడబుట్టిన చెల్లిని అన్న చంపేసిన సంఘటన వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

 కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు

చెన్నై: తిరుప్పూరులో వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించి. వివాహం చేసుకునేందుకు ప్రయత్నించిన యువతిని హతమార్చిన ఆమె సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు.. వివరాలిలా... తిరుప్పూరు(Tiruppur) జిల్లా పల్లడం సమీపం పరువాయ్‌ గ్రామంలో దండపాణికి విద్య (22) అనే కుమార్తె, శరవణకుమార్‌ (24) అనే కుమారుడు ఉన్నారు. విద్య కోవైలోని ప్రభుత్వ కళాశాలలో ఎంఏ చదువుతోంది. ఆ యువతికి తిరుప్పూరు విజయపురం(Tiruppur Vijayapuram) ప్రాంతానికి చెందిన వెణ్‌మణి (22) అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగామారింది.

ఈ వార్తను కూడా చదవండి: Waqf Act: వక్ఫ్ చట్టం 1995 vs వక్ఫ్ సవరణ బిల్లు 2025


వేరే కులానికి చెందిన యువకుడితో పెళ్ళికి విద్య కుటుంబీకులు అంగీకరించలేదు. ఈ పరిస్థితులలో ఈ నెల 30న విద్య తల్లిదండ్రులు చర్చికి వెళ్లగా, విద్యా ఇంటిలోనే ఉంది. చర్చికి వెళ్ళి ఇంటికి తిరిగొచ్చిన సోదరుడు శరవణన్‌, తండ్రి దండపాణి ఓ గదిలో విద్య వంటి నిండగా గాయాలతో తలపై బీరువా పడి ఉండగా గమనించి, ఆంబులెన్స్‌కు కబురు చేశారు. ఆంబులెన్స్‌ సిబ్బంది వచ్చి విద్యను పరీక్షించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు నిర్ధారించారు.


nani1.2.jpg

ఆ తర్వాత కుటుంబీకులు యువతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వెణ్‌మణి తన ప్రేమికురాలి మృతిపై అనుమానం వ్యక్తంచేస్తూ గ్రామ నిర్వహణాధికారి పూంగొడికి ఫిర్యాదు చేశారు. ఆ మేరకు తహసీల్దార్‌ శబరగిరి, పోలీసులు విద్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు పంపారు. పోస్టుమార్టం రిపోర్టులో బీరువా తలపై పడటం వల్ల విద్య మరణించలేదని, తలపై వేటకొడవలితో కొట్టి హత్య చేసినట్లు వెల్లడైంది.


దీంతో కామనాయకన్‌పాళంయ పోలీసులు దండపాణి, శరవణకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విద్య వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించడాన్ని సహించలేక ఆమె సోదరుడు శరవణకుమార్‌ ఇనుప కమ్మీతో కొట్టి హత్య చేసినట్లు తెలుసుకున్నారు.. పోలీసులు పరువు హత్యకేసుగా నమోదు చేసుకుని శరవణకుమార్‌ను అరెస్టు చేశారు. కాగా ఈ పరువు హత్యను వివిధ పార్టీల నేతలు తీవ్రంగా ఖండించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

శాంతికి మేం సిద్ధం!

కొత్త తల్లులు గిల్ట్‌ లేకుండా..

Sangareddy: రాతి గుండె తల్లి

ఖమ్మం జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 03 , 2025 | 11:56 AM