Hyderabad: ఇప్పుడే వస్తానన్నాడు.. శవమై కనిపించాడు
ABN , Publish Date - Jan 02 , 2025 | 01:39 PM
పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఓ గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) పరిధిలో మూడు రోజుల క్రితం అదృశ్యమైన వ్యాపారి ఎస్‌ఆర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుళ్లిపోయిన స్థితిలో శవమై కనిపించాడు. ఓ గదిలో నుంచి దుర్వాసన రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిగూడ(Yellareddyguda)కు చెందిన విష్ణు రూపాని(45) కుటుంబ సభ్యులతో కలిసి కిరాణా స్టోర్‌తో పాటు పలు వ్యాపారాలు చేస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య
డిసెంబరు 29న రోజు మాదిరిగానే షాపు మూసివేసి రాత్రి 10.30 సమయంలో ఇంటికి వచ్చాడు. పని ఉందని, కాసేపట్లో తిరిగి వస్తానని ఇంటి నుంచి వెళ్లాడు. అర్థరాత్రి అయినా రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో 30వ తేదీన కుటుంబ సభ్యులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం ఎస్‌ఆర్‌నగర్ పీఎస్ పరిధిలోని శ్రీనివాసనగర్ ఈస్ట్ బుద్ధనగర్ లోని ఓ గదిలో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది అక్కడకు చేరుకొని పరిశీలించగా కుళ్లిపోయిన స్థితిలో విష్ణు రూపాని మృతదేహం కనిపించింది.
ఆ గదిలో మద్యం తాగిన ఆనవాళ్లు కనిపించాయి. సీసీ కెమెరా ఫుటేజీ(CCTV footage)ని పరిశీలించగా విష్ణుతో పాటు మరో వ్యక్తి ఆ గదిలోకి వెళ్లాడు. సుమారు మూడు గంటల తర్వాత అతడు బయటకు వచ్చాడు. కెమెరాలకు దొరకకుండా ముఖానికి వస్త్రం కట్టినట్టు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల కారణంగా స్నేహితుడే విష్ణు రూపానిని హతమార్చినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. గదిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News