Hyderabad: ఇల్లాలి ఉసురు తీసిన ఇంటి గొడవ..
ABN , Publish Date - Jan 01 , 2025 | 07:41 AM
ఇంటి గొడవ ఓ ఇల్లాలి ఉసురు తీసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్(Boduppal Municipal Corporation)కు చెందిన నిహారిక(35)కు ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం(Tirumalayapalem Mandal), కాకరవాయి గ్రామానికి చెందిన శ్రీకర్‌రెడ్డి(Srikar Reddy)తో 2017లో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు.
హైదరాబాద్: ఇంటి గొడవ ఓ ఇల్లాలి ఉసురు తీసింది. బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్(Boduppal Municipal Corporation)కు చెందిన నిహారిక(35)కు ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం(Tirumalayapalem Mandal), కాకరవాయి గ్రామానికి చెందిన శ్రీకర్‌రెడ్డి(Srikar Reddy)తో 2017లో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటి నుంచి నిహారికకు పుట్టింటి వారు ఇచ్చిన ఘట్‌కేసర్ మండలం, ప్రతాపసింగారంలో గల ఇంట్లో ఉంటున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్టు..
ఈ ఇల్లు తన పుట్టింటి వారు ఇచ్చినదని నిహారిక భర్తతో పదే పదే అంటుండడంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. మంగళవారం తెల్లవారు జామున ఇంటి విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగి తోసుకోవడంతో నిహారిక కిందపడింది. ఆవేశంలో ఉన్న శ్రీకర్‌రెడ్డి(Srikar Reddy) బండరాయితో భార్య తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు
ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905
ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు
Read Latest Telangana News and National News