Share News

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల ముఠా అరెస్టు..

ABN , Publish Date - Jan 01 , 2025 | 07:12 AM

రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్స్‌(Rachakonda, Hyderabad Commissionerates) పరిధిలోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లు సహా.. ఇతర దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు.

Hyderabad: సెల్‌ఫోన్‌ దొంగల ముఠా అరెస్టు..

- ఎనిమిది మంది నిందితులకు బేడీలు

- రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్స్‌(Rachakonda, Hyderabad Commissionerates) పరిధిలోని పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లు సహా.. ఇతర దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా ఆటకట్టించారు సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు. ఆరుగురు నిందితులను, ఇద్దరు రిసీవర్స్‌ మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం...

ఈ వార్తను కూడా చదవండి: New Year: న్యూ ‘ఇయర్‌’ జోష్‌..


హుస్సేనీ ఆలం, ఐస్‌ సదన్‌ పోలీస్‌ పరిధిలో వరుస సెల్‌ఫోన్‌చోరీలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. దాంతో ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర(Inspector Raghavendra) ఆధ్వర్యంలో సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. టెక్నికల్‌ ఎవిడెన్స్‌తో నిఘా పెట్టి నిందితుల ముఠాను పట్టుకున్నారు. షాహిన్‌నగర్‌కు చెందిన ఎండీ అబ్బా్‌సఅలీ అలియాస్‌ చోర్‌ అబ్బా్‌సకు 60 ఏళ్లు. ఇతడు 35 ఏళ్లుగా దొంగతనాలు, దోపిడీలు, గొడవలు, కొట్లాటలు, ఇతరులపై భౌతిక దాడులకు పాల్పడేవాడు.


ఈ క్రమంలో అతనిపై హుస్సేనీఆలం పీఎ్‌సలో రౌడీషీట్‌తో పాటు.. నగరంలో 37 కేసులు ఉన్నాయి. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటుపడిన చోర్‌ అబ్బాస్‌ సులభంగా డబ్బు సంపాదనకు దొంగతనాలు దోపిడీలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మరో నలుగురు యువకులు మహ్మద్‌ సాధిక్‌, మహ్మద్‌ రిజ్వాన్‌, మహ్మద్‌ దస్తగిరి, మహ్మద్‌ సత్తార్‌ను తనతో చేర్చుకొని ముఠాగా ఏర్పడ్డాడు. రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్స్‌ పరిధిలోని నిర్యానుష్య, రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్‌లను చోరీచేస్తున్నారు. ఎవరైనా ఎదురు తిరిగితే కత్తితో బెదిరించి పరారవుతున్నారు.


city2.2.jpg

ఇలా కొట్టేసిన సెల్‌ఫోన్‌లను రెయిన్‌ బజార్‌కు చెందిన షేక్‌అజహర్‌, అజ్జూకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు ఐస్‌సదన్‌, హుస్సేనీ ఆలం పోలీసులతో కలిసి 8 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 8 సెల్‌ఫోన్‌లు, ఒక కత్తి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 07:12 AM