Hyderabad: జల్సాలకు అలవాటుపడి.. అతను చేసిన పనేంటో తెలిస్తే..
ABN , Publish Date - Apr 19 , 2025 | 10:29 AM
జల్సాలకు అలవాటుపడిన ఓ ప్రబుద్దుడు అడ్డదారుల్లో వెళ్లి చివరకు కటకటాలపాలయ్యాడు. ఏకంగా నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయాలకు దిగాడు. కానీ.. అది ఎల్లకాలం ఆగదు కదా. పాపంపండి చివరకు కటకటాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయం
హైదరాబాద్ సిటీ: జల్సాలకు అలవాటు పడి నకిలీ ఇంజన్ ఆయిల్‌ను విక్రయిసున్న ఓ వ్యక్తి గోదాంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం దాడి చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. గోదాం నుంచి రూ.3లక్షల విలువైన 710 లీటర్ల నకిలీ ఇంజన్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు. బేగంబజార్‌కు చెందిన షేక్ ఖయ్యూం కొంతకాలం కిత్రం టెంపో మెకానిక్‌గా, ఆటోమెబైల్ షాపులో పనిచేశాడు. అదనపు సంపాదన కోసం ఆటో నడుపుతున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Trains: వేసవిలో 20 వీక్లీ స్పెషల్ రైళ్లు
అయినా తన కుటుంబ పోషణకు, జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో నకిలీ ఇంజన్ ఆయిల్ తయారీకి సిద్ధమయ్యాడు. ఐదు నెలల క్రితం నూర్‌ఖాన్ వద్ద గోదాం అద్దెకు తీసుకుని క్యాస్ర్టాల్ ఆయిల్ పేరుతో నకిలీ ఇంజన్ ఆయిల్ విక్రయిస్తున్నాడు. క్యాస్ట్రాల్ ఆయిల్ ధర రూ.425 ఉండ గా.. ఖయ్యూం దాని లేబుల్ మార్చేసి వాహనదారులకు,

మెకానిక్‌లకు రూ.220కే విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మీర్‌చౌక్ పోలీసులతో కలిసి గోదాంపై దాడిచేశారు. నిందితుడిని అరెస్టు చేసి, ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. ఖయ్యూంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు మీర్‌చౌక్ పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
బస్తర్‌లో కాల్పుల విరమణ అత్యవసరం
ఆర్‌ఎస్‌ఎస్ తరహాలో.. ప్రజల్ని కలవండి
గ్రూప్-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయండి
Read Latest Telangana News and National News