Share News

Hyderabad: పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ABN , Publish Date - Jan 02 , 2025 | 07:28 AM

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. మలక్‌పేట ఎస్‌ఐ నవీన్‌(Malakpet SI Naveen) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్మాన్‌ఘడ్‌ బస్తీలో నివాసం ఉంటున్న జనావత్‌ కిరణ్‌(36) ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌ (2014 బ్యాచ్‌)గా పనిచేస్తున్నాడు.

Hyderabad: పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్య

- ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలతో మనస్తాపం

హైదరాబాద్: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‏స్టేషన్‌ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. మలక్‌పేట ఎస్‌ఐ నవీన్‌(Malakpet SI Naveen) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్మాన్‌ఘడ్‌ బస్తీలో నివాసం ఉంటున్న జనావత్‌ కిరణ్‌(36) ఫిలింనగర్‌ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌ (2014 బ్యాచ్‌)గా పనిచేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అనారోగ్య కారణాలతో సెలవు తీసుకున్నట్లు సమాచారం.

ఈ వార్తను కూడా చదవండి: AV Ranganath: ఆక్రమణల తొలగింపుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి


డిసెంబర్‌ 31న రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో కిరణ్‌పై మలక్‌పేట పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. కిరణ్‌ కూడా భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన కిరణ్‌ బుధవారం సాయంత్రం ఇంట్లోకి వెళ్లి గది తలుపులు బిగించుకున్నాడు. ఎంత పిలిచిన పలుకకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి చూడగా కిరణ్‌ ఫ్యాన్‌కు ఊరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.


city2.2.jpg

వెంటనే మలక్‌పేట పోలీసులకు సమాచారమిచ్చి, కిరణ్‌(Kiran)ను మలక్‌పేటలోని యశోద ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం కిరణ్‌ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసును నమోదు చేసుకున్న మలక్‌పేట్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు


ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్‌.. శామీర్‌పేటకు మెట్రో!

ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన

ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు

ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...

Read Latest Telangana News and National News

Updated Date - Jan 02 , 2025 | 07:28 AM