Hyderabad: మూడు నెలల్లో మూడు హత్యలు..
ABN , Publish Date - Apr 17 , 2025 | 08:56 AM
హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడ ఏరియాలో మూడు నెలల్లో.. మూడు హత్యలు జరిగాయి. దీంతో సమీప బస్తీవాసలు హడలెత్తిపెతున్నారు. క్షణాకావేశాలు, పాతకక్షల నేపధ్యంలో ఈ హత్యలు చోటుచేసుకున్నటికీ తెల్తవారితే ఏం వార్త వినాల్సి వస్తుందోననే భయంతో అక్కడిప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
- తండ్రులను చంపిన తనయులు
- ఒంటరి మహిళను అంతమొందించిన మైనర్
హైదరాబాద్: కుషాయిగూడ(Kushaiguda)లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా మూడు నెలల్లో మూడు హత్యలు జరిగాయి. ఇందులో రెండు హత్యలు తనయులు తండ్రులను చంపారు. ఇందులో నిందితులందరూ 25సంవత్సరాల లోపు వారే. తాజాగా ఓ బాలుడు ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని దారుణంగా హత్య చేశాడు. పై హత్యలన్నింటికీ ప్రధాన కారణం వేధింపులే. సహనం కోల్పోయి విక్షణారహితంగా చేసిన ఈ హత్యలు మానవ సంబంధాలను మంటకలిపాయి. తండ్రి అనే మమకారం లేకుండా కన్న కొడుకులే కాలయములుగా మారి హత్య చేయగా, తాజాగా 15 ఏళ్ల బాలుడు 70 ఏళ్ల వృద్థురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. క్షణాకావేశంలో సంబంధాలను మరచిపోయి దురాగతాలకు పాల్పడి తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుని జైలు పాలయ్యారు.
ఈ వార్తను కూడా చదవండి: MLC elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరగనుంది.. బీఆర్‌ఎస్ మద్దతుకు బీజేపీ యత్నం
ఈసీఐఎల్‌లో..
ఫిబ్రవరి 22న లాలాపేటకు చెందిన అరెల్లి మొగిలిని అతడి కుమారుడు సాయికుమార్(25) ఈసీఐఎల్‌లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై కత్తితో పొడిచిచంపాడు. తండ్రి నిత్యం మద్యం తాగొచ్చి తల్లి, చెల్లిని, తనను వేధిస్తున్నాడనే కోపంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు.
కుషాయిగూడ సాయునగర్‌లో..
మార్చి 24న రాత్రి కుషాయిగూడ సాయునగర్‌లో పత్లావత్ శంకర్(54)ను ఆయన కుమారుడు జగదీశ్(24) గొంతు నులిపి చంపాడు. తండ్రి మద్యం మత్తులో తల్లిని, తనను నిత్యం వేధిస్తున్నాడని, అందుకే చంపినట్లు జగదీష్ పోలీసుల విచారణలో తెలిపాడు. ప్రస్తుతం ఇద్దరు నిందితుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.

హెచ్‌బీకాలనీ కృష్ణానగర్‌లో..
ఈ నెల 14న హెచ్‌బీకాలనీ కృష్ణానగర్‌లో కమలమ్మ(70) అనే ఒంటరి మహిళను బాలుడు(17) దారుణంగా హత్య చేశాడు. వృద్ధురాలి తలపై ఇనుప రాడ్‌తో కొట్టి, చీరతో ఉరేసి చంపాడు. అనంతరం మృతదేహం గొంతుపై కాళ్లతో తొక్కుతూ ఎగిరి గెంతేస్తూ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలు అందరినీ కలిచి వేశాయి. వృద్ధురాలు దుకాణం నిర్వహణలో తనను నిత్యం వేధిస్తుందని ఒంటరిగా ఉన్న ఆమె ఇంట్లోకి ఈ నెల 11న రాత్రి చొరబడి హత్య చేశాడు. సదరు బాలుడుని అదుపులోకి తీసుకుని రెండు రోజుల పాటు విచారించిన పోలీసులు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు. ఇలా వరుస హత్యలు కుషాయిగూడ పోలీసులకు సవాలుగా మారాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News