Share News

Hyderabad: జార్ఖండ్‌ నుంచి యువకులను తీసుకొచ్చి చోరీలు..

ABN , Publish Date - Jan 01 , 2025 | 08:31 AM

జార్ఖండ్‌(Jharkhand) నుంచి యువకులను తీసుకొచ్చి నగరంలో సెల్‌ఫోన్‌లు చోరీ చేయిస్తున్న ముఠాలో ముగ్గురు యువకులను ఖైరతాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువగల 58 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad: జార్ఖండ్‌ నుంచి యువకులను తీసుకొచ్చి చోరీలు..

- ముగ్గురు యువకుల అరెస్ట్‌

హైదరాబాద్: జార్ఖండ్‌(Jharkhand) నుంచి యువకులను తీసుకొచ్చి నగరంలో సెల్‌ఫోన్‌లు చోరీ చేయిస్తున్న ముఠాలో ముగ్గురు యువకులను ఖైరతాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి సుమారు రూ. 30 లక్షల విలువగల 58 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో సైఫాబాద్‌ ఏసీపీ ఆర్‌. సంజయ్‌కుమార్‌, ఖైరతాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ వివరాలు వెల్లడించారు. చింతలబస్తీ రహదారిలో సోమవారం రాత్రి 10.30 గంటల సమయంలో మహేందర్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ఫోన్‌ రావడంతో ప్రేంనగర్‌ కమాన్‌ వద్ద ఆగాడు.

ఈ వార్తను కూడా చదవండి: Royal Enfield: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మాత్రమే..


ముగ్గురు యువకులు అతడి వద్దకు వచ్చిన ఫోన్‌ ఇవ్వాలని, లేకపోతే చంపేస్తామని మహేందర్‌ను బెదిరించారు. ఫోన్‌ ఇవ్వగానే నిందితులు పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. నిందితులు ఓ ఇంట్లోకి వెళ్లినట్లు గురించారు. ఆ ఇంటికి వెళి దీపక్‌ కుమార్‌ (21), గోబింద్‌ కుమార్‌ (23), రాహుల్‌ నోనియా (27)ను అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ జార్ఖండ్‌ రాష్ట్రం, సాహెబ్‌గంజ్‌ జిల్లా, తింపాహర్‌, బాబూపూర్‌కు చెందిన వారు. విచారించగా.. హైదరాబాద్‌లో సెల్‌ఫోన్లను చోరీ చేసి జార్ఖండ్‌లో విక్రయిస్తున్నట్లు అంగీకరించారు.


సూత్రధారి పింకూ మెహతా..

సెల్‌ఫోన్ల చోరీలకు అసలు సూత్రధారి జార్ఖండ్‌కు చెందిన పింకూ మెహతా(30) అని పోలీసులు నిర్ధారించారు. ఇతడు జార్ఖండ్‌కు చెందిన పేద వర్గాల్లో డబ్బులు అవసరమున్న వారిని గుర్తించి ఉపాధి ఇప్పిస్తానని చెప్పి హైదరాబాద్‌ తీసుకొచ్చి ఖైరతాబాద్‌ ప్రేంనగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని వారితో సెల్‌ఫోన్లు చోరీ చేయిస్తున్నట్లు తేలింది. పింకూ మెహతాతోపాటు మరో ఇద్దరు సాగర్‌ కుమార్‌ నానియా(25), కుషాల్‌ నానియా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


city5.2.jpg

అరెస్ట్‌ అయిన వారిలో దీపక్‌కుమార్‌(Deepak Kumar)పై పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 9 కేసులు, మరో ఇద్దరిపై 13 సెల్‌ఫోన్‌ చోరీ కేసులున్నాయన్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 58 ఫోన్లలో 6 ఐఫోన్లు, 9 వన్‌ ప్ల్‌స, 9 ఒప్పో, సామ్‌సంగ్‌ ఫోన్లు 9, రెడ్‌మీ 7, వివో 8, మోటరోలా 3, ఐకూ 2 ఫోన్లు ఉన్నాయని ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకున్న పోలీస్‌ సిబ్బందిని సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ఆకాంక్ష్‌ యాదవ్‌ అభినందించారు.


city5.3.jpg

ఈవార్తను కూడా చదవండి: రైళ్ల వేళల్లో మార్పులు

ఈవార్తను కూడా చదవండి: కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్లు 24,905

ఈవార్తను కూడా చదవండి: సంక్షేమ ఫలాలు ప్రజల చెంతకు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 01 , 2025 | 08:31 AM