Road Accidents: అయ్యో.. ఆ కుటుంబాలకు ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి..
ABN , Publish Date - Jan 01 , 2025 | 11:37 AM
ఆంధ్రప్రదేశ్: నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణంపేట గ్రామానికి చెందిన మన్నెం ఓబులేసు(60) రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఓబులేసు ఇవాళ ఉదయం పని నిమిత్తం సీతారామపురం మండల కేంద్రానికి బయలుదేరాడు. అయితే గ్రామ శివారుకు చేరుకోగానే ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు.
అమరావతి: నూతన సంవత్సరం వేళ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఘోర ప్రమాదాలు పలువురి ప్రాణాలను హరించాయి. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ వైపు అంబరాన్నంటిన సంబరాలు జరుగుతుంటే.. మరోవైపు రోడ్డుప్రమాదాలు మరికొన్ని కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చాయి. ఇవాళ(బుధవారం) జరిగిన ప్రమాదాలు పలువురి ప్రాణాలను బలి తీసుకుని కుటుంబాలను రోడ్డున పడేశాయి.
నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం నారాయణంపేట గ్రామానికి చెందిన మన్నెం ఓబులేసు(60) రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. ఓబులేసు ఇవాళ ఉదయం పని నిమిత్తం సీతారామపురం మండల కేంద్రానికి బయలుదేరాడు. అయితే గ్రామ శివారుకు చేరుకోగానే ద్విచక్రవాహనం ఒక్కసారిగా అదుపుతప్పి కిందపడిపోయాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఓబులేసు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దుత్తలూరు వద్ద జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న కారు.. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో నర్రవాడ గ్రామానికి చెందిన వెంగయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో బాధిక కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
అలాగే నూతన సంవత్సరం వేళ బాపట్ల జిల్లాలోనూ విషాద ఘటన చోటు చేసుకుంది. అద్దంకి-నాగులపాడు రోడ్డులో ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. అతివేగంతో వచ్చిన బైక్‌లు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో అద్దంకికి చెందిన బి.అజయ్(39) మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం లక్ష్మణ్ నాయక్ తండాలో దారుణ ఘటన వెలుగు చూసింది. ధరావత్ శేషు(35)ను అతని చిన్నాన్న కుమారుడు ధరావత్ దీపక్ దారుణంగా హతమార్చాడు. పాతకక్షల నేపథ్యంలో శేషును దీపక్ కత్తితో పొడితి హత్య చేశాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, అప్పటివరకూ కళ్ల ముందు తిరిగిన తమ వారు ఇక లేరని తెలిసి బాధిత కుటుంబాల రోదనలు మిన్నంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
Happy New Year-2025: దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి..
New Year-2025: ఏపీ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కూటమి అగ్రనేతలు..